ఏపీ: ఆ విషయంలో పట్టు విడవని చంద్రబాబు.. చివరికి సక్సెస్ అయ్యేనా..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీపై ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగాన్ని మార్చేయాలని బాగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. ఇప్పటికీ అధికారులను మార్చేసి తనకు అనుకూలమైన అధికారులతో భర్తీ చేయించాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక యంత్రాంగాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. ఏదైనా ఒక బలమైన కారణం చూపిస్తేనే ఆ పని చేయడం కుదురుతుంది. అందువల్ల ఈ టీడీపీ అధినేత ప్రయత్నాలు విఫలమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏపీ జగన్ మీద దాడి జరగడం అధికారుల వైఫల్యానికి కారణం అన్నట్లు టీడీపీ ఆరోపిస్తూ వారిని మార్చాలని కోరుతోంది. అయితే టీడీపీ వాళ్ళే ఈ దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. పోయినసారి చంద్రబాబు, డీజీపీ సెక్రటరీని మార్పించగలిగారు. ఇలాంటి ఎన్ని మార్పులు చేసినా ప్రజల్లో ఆదరణ లేకపోతే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ. మంచి పరిపాలన అందిస్తే ఇలాంటి కుయుక్తులకు పోవాల్సిన అవసరం ఉండాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రచారం సమయంలో మనకి తానే నష్టం జరిగేలా మాట్లాడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సరిగా పని చేయకుండా వేరే వాళ్లకు ఆ పనులను అప్పగించారు. బీజేపీ అభ్యర్థులకు టీడీపీ మద్దతు అందించడం లేదు. మొత్తం మీద చంద్రబాబు ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.