నిజాంబాద్ : కాంగ్రెస్ కంచుకోటను.. మళ్లీ నిర్మించుకోగలదా?

praveen
తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సీఎం రేవంత్ అధిష్టానంతో చర్చలు జరిపి గెలుపు గుర్రాలను బరిలోకి దింపారు. ఇక అన్ని స్థానల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక పార్టీలోని సీనియర్ నేతలు అందరూ కూడా ఇలా హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 ఇక మరోవైపు అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బిజెపి పార్టీల సైతం  పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నాయ్. అయితే ఒక్క పార్లమెంట్ స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తమ కంచుకోట ను మరోసారి నిర్మించుకుంటుందా అనే విషయంపై చర్చ జరుగుతుంది. నిజాంబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ జెండా ఎగిరింది. దీంతో ఇక ఆ పార్టి హవా కొనసాగుతుంది అనుకున్న 2019 ఎన్నికల్లో అక్కడి ప్రజలు బిజెపికి పట్టం కట్టారు.

 ఇలా అనూహ్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కు కొనసాగుతుంది బిజెపి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా.. 11 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. టిడిపి మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకసారి బీఆర్ఎస్ మరోసారి బిజెపి విజయం సాధించడం గమనార్హం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మంచిపట్టున్న జీవన్ రెడ్డిని ఇక్కడి నుంచి బలులోకి దింపింది కాంగ్రెస్. ఇక మిగతా పార్టీ అభ్యర్థులతో గెలుపు కోసం గట్టిగానే పోరాడుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ హవా రాష్ట్రంలో కొనసాగుతుండగా.. హస్తం పార్టీ మరోసారి తమ కంచుకోట నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నిర్మించుకుంటుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రజలు ఏం నిర్ణయిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: