పవన్: తమిళసైకి ప్రచారం.. కలిసొచ్చేనా..?

Divya
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ నుంచి ప్రచారానికి వెళ్లబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇన్ఫాక్ట్ తమిళనాడులో చూడాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ గత పదేళ్ల నుంచి తమిళనాడులో బిజెపి పార్టీ పోరాడుతూనే ఉంది.. బిజెపి కూటమిలో భాగంగా బ్రేక్ ఇచ్చిన మళ్లీ ఈసారి ఎన్నికలలో కలిశారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని బిజెపి పార్టీ పవన్ కళ్యాణ్ వినియోగించుకుంది. అక్కడ కూడా పెద్దగా ఇంఫాక్ట్ చూపలేదు పవన్ కళ్యాణ్.

కానీ ఎప్పుడూ కూడా బయట వినియోగించుకున్నది లేదు. 2014 ఎన్నికలలో భాగంగా భారతీయ జనతా పార్టీ వినియోగించుకుంది పవన్ కళ్యాణ్ ని. కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడుకు ఆ ఏరియాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ అంటే  మంచి పట్టు ఉంటుంది. అలాగే ఒరిస్సా వంటి ప్రాంతాలలో కూడా పవన్ కళ్యాణ్ కి పట్టు ఉంటుందని బిజెపి పార్టీ గ్రహించి అక్కడ ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా తనకు కేరళలో కూడా పట్టు ఉందని పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది.

అయితే ప్రస్తుతం తమిళనాడులో పర్సనల్గా అడిగినందువల్ల తెలంగాణ మాజీ గవర్నర్ బిజెపి ఎంపీ అభ్యర్థి తమిళసైకి మద్దతుగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ రోడ్డు షో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనంతరం చెన్నైలో సాయంత్రం పవన్ కళ్యాణ్ ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అన్నామలై కి లోకేష్ కోయంబత్తూర్ లో ప్రచారం చేసి పెట్టారు. ఇప్పుడు తమిళసైకి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. మరి ఏ విధంగా వీరి ప్రచారం అక్కడ బిజెపి పార్టీకి ఉపయోగపడుతుందా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: