ఏపీ: జగన్ ఔట్.. షాకిచ్చిన సర్వే..!

Pandrala Sravanthi
ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు ఓ వైపు ప్రచారం జరుగుతూ ఉంటేనే  మరోవైపు సర్వేల పర్వం కొన సాగుతూ ఉంటుంది. ఈ సర్వేల ఆధారంగానే గెలుపోటములు కూడా  ఒక్కోక్క సారి నిర్ణయించ బడతాయి. అయితే మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి.  ఇందులో కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే మరికొన్ని సర్వేలు  తప్పక కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. కానీ ఎక్కువ మట్టుకు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుందని తెలియజేశారు. ఆ సర్వేల ప్రకారమే కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం ఏపీలో పాలిటిక్స్ చాలా రస వత్తరంగా   సాగుతున్నాయి. 

ఇక్కడ టిడిపి కూటమి, వైసిపి మధ్య హోరా హోరీ పోటీ జరుగుతుంది. ఇక్కడ కూడా సర్వేలు చాలా ఆసక్తికరంగా మారాయి. తాజాగా వచ్చిన ఒక సర్వే  జగన్ కు షాక్ ఇచ్చింది. ఆ సర్వేలో ఏముందో చూద్దాం.. అయితే ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 సర్వేలను అంతగా ప్రజలు విశ్వసించలేరు. ఎందుకంటే ఇవి వన్ సైడ్ వారులా సర్వే ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. తాజాగా వచ్చిన న్యూ ఎక్స్ సర్వే ప్రకారం  తెలుగుదేశం కూటమికి 18 పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతోందని, వైసీపీ కేవలం 7 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని తెలియజేసింది.

 ఇక తెలంగాణ విషయానికి వస్తే  కాంగ్రెస్ 8 సీట్లు, బీజేపీ 5, బీఆర్ఎస్ 3  అలాగే ఎంఐఎం 1 గెలుస్తుందని అంచనా వేసింది. సర్వేలు ఈ విధంగా ఉన్నాయి కానీ ప్రజలు ఏ వైపు ఉన్నారనేది చెప్పడం చాలా ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఏ పార్టీ ప్రచారం చేసిన ఆ పార్టీలో ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నారు.  కానీ ఎటు ఓటు వేస్తారనేది చెప్పడం కష్టంగా మారింది. ఇదిలా ఉండగా  ప్రస్తుత సర్వే బయ టకు రావడంతో  వైసీపీ శ్రేణుల్లో కాస్త నైరాశ్యం నెలకొంది. దీంతో వారి ప్రచారాన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: