అతి అన‌ర్థమే చంద్ర‌బాబు కొపం కొల్లేరు చేసిందే..!

RAMAKRISHNA S.S.
- అతి హామీలతోనే ఏపీ జ‌నాలు బాబును న‌మ్మ‌ట్లేదా..!
- మ‌హిళ‌ల్లోనూ బాబుకు క‌నిపించని పాజిటివిటి..!
- ఇంటికి కిలో బంగారంతో పోలుస్తూ సెటైర్లు...!
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక రేంజ్‌లో చెల‌రేగి పోతున్నారు. ఒక‌వైపు అభివృద్ధినినాదం అందిస్తూనే మ‌రోవైపు సంక్షేమ సామ్రాజ్యం సృష్టిస్తాన‌ని చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఇది కామ‌న్‌. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి హామీలు.. కూడా ఏ పార్టీకైనా సాధార‌ణ‌మే. అయితే.. ఇక్క‌డ‌కావాల్సింది ఏంటంటే.. ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారా?  లేదా?  అనేదికీల‌కం. ఎన్ని హామీలు ఇచ్చినా.. ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌పోతే.. ఎస‌రు ప‌డిపోతుంది!.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు పెద్ద‌గా దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. త‌న మానాన తాను.. ప‌థ‌కాలు ప్ర‌క‌టించుకుంటూ పోతున్నారు. అయితే.. దీనిపై పాజిటివ్ చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. నెగిటివ్ ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణ ప్ర‌జ‌లు గుడిగూడే చోట‌.. స‌హ‌జంగానే తెర‌మీదికి చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేస్తాన‌ని చెబుతున్న ప‌థ‌కాల‌పై చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా మ‌హిళ‌ల్లోనే ఈ చ‌ర్చ ఎక్కువ‌గా ఉంది. కానీ, చంద్ర‌బాబు కు పాజిటివ్ టాక్ వినిపించ‌డం లేదు.

ఎందుకంటే.. గ‌త ఏడాది వ‌ర‌కు.. జ‌గ‌న్ ఇస్తున్న అమ్మ ఒడి.. చేయూత వంటి భారీ ఉచిత ప‌థ‌కాల కార ణంగా రాష్ట్రం శ్రీలంక‌ అయిపోయేందుకు రెడీ అయింద‌ని.. ఇథియోపియా అయిపోతుంద‌ని ఇదేచంద్ర బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు అవే ప‌థ‌కాల‌ను మ‌రింత‌గా పెంచేసి తాము వ‌చ్చాక అమ‌లు చేస్తామ‌ని బాబు చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డ చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌పై ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి ఎందుకంటే.. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ కుటుంబంలోని ఎవ‌రికో ఒక‌రికి మాత్ర‌మే  అమ్మ ఒడి డ‌బ్బులు ఇస్తున్నారు.

కానీ, చంద్ర‌బాబు మాత్రం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత‌మందికీ ఇస్తామంటున్నారు. దీనిని ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేదు. ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనిపైనా అను మాన‌పు మేఘాలు ముసురుకున్నాయి. ఇక‌, ఆటో, టాక్సీ కార్మికులు.. బాబుకు దూర‌మ‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. ఇక‌, నిరుద్యోగ భృతివిష‌యంలోనూ యువత చంద్ర‌బాబును న‌మ్మ‌డంలేదు. అలాగే ఇంట్లో మ‌హిళ‌ల‌కు 18 సంవ‌త్స‌రాలు నిండితే.. వారికి నెల‌కు రూ.1500 చొప్పున ఇంట్లోఎంత మంది ఉంటే అంత‌మందికీ ఇస్తామ‌ని చెబుతున్నారు.

ఇక‌, సామాజిక పింఛ‌న్ల‌ను రూ.4 వేల‌కు, దివ్యాంగుల పింఛ‌న్‌ను రూ.6 వేల‌కు పెంచుతామ‌ని బాబు చెబు తున్నారు. అంతేకాదు.. వీటిని ఏప్రిల్ నుంచే అమ‌లు చేసి.. జూన్‌లో ఇస్తామ‌ని అంటున్నారు. కానీ, ఇవి సాధ‌మయ్యేలా లేవ‌నేది స్థానిక ప్ర‌జ‌ల మాట‌. అంతేకాదు.. జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌చారం ఇంటికి కిలో బంగారం ఇస్తామ‌ని చెబుతున్న మాట‌కు ఇది ప‌క్కాగా స‌రిపోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ముందు దీనిని ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. అతిగా మాట్లాడినా.. అతిగా హామీలు ఇచ్చినా.. రాజ‌కీయ నాయ‌కులు త‌మ గొప్ప‌త‌నాన్ని కోల్పోవ‌డ‌మే కాకుండా.. విశ్వ‌స‌నీయ‌త‌ను కూడా కోల్పోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: