జహీరాబాద్ : ఈ లెక్కన చూస్తే.. అక్కడ కాంగ్రెస్సే గెలుస్తుందట?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేనివిధంగా ఇక్కడ రాజకీయాలు రసవత్తంగా మారిపోయాయి అని చెప్పాలి. ఇక మూడు పార్టీలు కూడా ఇక్కడ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన పోటీ మాత్రం బిజెపి కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంది అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఇక బీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు.  

 అయితే గత పార్లమెంట్ ఎన్నికలకి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకి రాజకీయ పరిణామాలు ఎంతగానో మారిపోయాయి. ఈ క్రమంలోనే ఈసారి ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఎందుకంటే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా ఇక మూడుసార్లు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారు  ఒకసారి కాంగ్రెస్ రెండుసార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది.

 అయితే ఇప్పుడు మాత్రం బిఆర్ఎస్ బిసి అభ్యర్థిని బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎంపీ, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత బీబీ పాటిల్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు   ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సురేష్ షట్కార్ కూడా లింగాయత్ వర్గానికి చెందినవాడే. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్ లోని ఏడు నియోజకవర్గంలో నాలుగింటిలో కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించింది. అంతేకాదు ఇక  బీఆర్ఎస్ బిజెపితో పోల్చి చూస్తే కాంగ్రెస్కే ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బిజెపికి పెద్దగా  ఆదరణ లేదు అన్నది అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతం చెప్పకనే చెబుతుంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇంకోవైపు సురేష్ షెట్కర్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇలా అన్ని పరిణామాలు చూసుకుంటే  బిజెపి బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకే అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్నారట. మరి ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: