ఏపీ : ఏ సర్వే చూసినా వైసీపీదే గెలుపు.. వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయా?

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏ సర్వే ఫలితాలు వెలువడినా ఆ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. వైసీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తుండగా తాజాగా ఒక సర్వేలో వైసీపీ ఏకంగా 150కు పైగా స్థానాలలో విజయం సాధిస్తుందని వెల్లడైంది. మరి వాస్తవంగా ప్రజలు పూర్తిస్థాయిలో వైసీపీకే అనుకూలంగా ఉన్నారా? అంటే మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుంది.
 
కూటమి గెలిచినా వైసీపీ గెలిచినా 100 సీట్లకు అటూఇటుగా వస్తాయే తప్ప అంతకు మించి ఆశించవద్దని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. కొన్ని జిల్లాలు పూర్తిస్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉండగా మరికొన్ని జిల్లాలలో కూటమికి అనుకూలంగా ఓటర్లు ఉన్నారు. రాయలసీమ నియోజకవర్గాలు వైసీపీకి ప్లస్ అవుతుండగా గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కూటమికి అనుకూలంగా ఉన్నాయి.
 
మిగతా జిల్లాలలో ఏ పార్టీ పైచేయి సాధిస్తే ఆ పార్టీదే అధికారం అని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు. వైసీపీ సర్వేలను నమ్ముకుంటే మాత్రం ఎన్నికల ఫలితాల్లో భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. ఒక్క రాయి విసిరినంత మాత్రాన ఈ ఎన్నికల్లో గెలుపును ఆపలేరని జగన్ చెబుతున్నా సానుభూతితో ప్రతి ఎన్నికల్లో ఓట్లు పడే ఛాన్స్ ఉండదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఏపీకి చెందిన ఓటర్లలో చాలామంది ఏ పార్టీకి అనుకూలంగా ఓటేస్తామనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. అలాంటి ఓటర్ల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఇటు కూటమి అటు వైసీపీ పోల్ మేనేజ్ మెంట్ విషయంలో గత ఎన్నికలతో పోలిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కనీసం 10 నుంచి 15 నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్ మెంట్ ఎన్నికల ఫలితాలను మార్చే ఛాన్స్ అయితే ఉంది. గెలుపు కోసం కూటమి, వైసీపీ మరింత కష్టపడాల్సి ఉంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: