రాయి ఎటాక్: సీఎం జగన్ ఘటన పైన విస్తుపోయో నిజాలు..!!

Divya
నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు మరొకసారి వేడెక్కుతున్నాయి.. ముఖ్యంగా సీఎం జగన్ పైన దాడి జరిగిన నేపథ్యంలో వైసిపి శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా జగన్ పైన జరిగింది రాళ్లదాడి కాదని ఎయిర్ గన్ తో కాల్చారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా జగన్ కనతకు గురిపెట్టి షార్ప్ షూటర్ తోనే టిడిపి హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ రాయి మరొకచోట తగిలి ఉంటే కచ్చితంగా ప్రమాదం జరిగేదంటూ వెల్లడిస్తున్నారు.

ఈ ఘటన పైన ఎన్నికల సంఘం విచారణకు కూడా ఆదేశించాలంటూ కోరారు వైసిపి నేతలు. దీంతో ఈ దాడికి సంబంధించి విజయవాడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.. ఈ కేసు పైన పలు కీలకమైన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ప్రధానంగా సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు విజయవాడ పోలీసులు.. సీట్ ఏర్పాటులో భాగంగా గంగమ్మ గుడి ప్రాంతంలో, అజిత్ సింగ్ నగర్ లో మూడు సెల్ఫోన్ టవర్స్ కింద ఉండే డేటాను కూడా స్వాధీనం చేసుకొని  కాల్ డేటా ను ఫిల్టర్ చేసినట్లుగా పోలీసులు తెలుస్తోంది. దాదాపుగా 20,000 సెల్ ఫోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..అయితే దాడి జరిగిన ప్రాంతంలో గత 15 రోజుల నుంచి అనుమాదాస్పదంగా కదలికల పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా సమాచారం.

అయితే ఇప్పటికే పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు సైతం తమదైన స్టైల్ లో విచారిస్తున్నారట. ఐపిసి  సెక్షన్ 307 కింద హత్యాయత్నంతోపాటు నాన్ బెయిలబుల్ కేసును కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి ఘటన పైన 20 మందితో ఆరు ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిపి క్రాంతి రానా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ స్థాయి అధికారం నేతృత్వంతోనే విచారణ చేపట్టాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఇప్పటికే అక్కడ సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారని.. స్కూల్ , టెంపుల్ మధ్య ఓపెన్ ప్లేస్ ఉండడం చేత దాడి చేసినట్లుగా నిర్ధారించారు. అయితే అక్కడ భారీ శబ్దం వచ్చిందని కూడా స్థానికులు చెబుతున్నారు దీంతో ఎయిర్ గన్ తోనే జగన్ పైన దాడి జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: