హైదరాబాద్ : ఓవైసీ రిక్వెస్ట్.. రేవంత్ యాక్సెప్ట్?

praveen
రాజకీయాల్లో ఎప్పుడూ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటివరకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న రేంజ్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నాయకులే మరుసటిరోజే ఒకే పార్టీలో చేరి స్నేహితుల్లా కలిసిపోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటివి నేటితరం రాజకీయాలలో సర్వసాధారణంగా మారిపోయాయి  అయితే ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటివే జరుగుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ ఫై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇక ఇప్పుడు హస్తం గూటికి చేరుకుంటున్నారు.

 అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక లోక్సభ స్థానం విషయంలో మరో పార్టీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ అయింది. మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీని తిట్టి కించపరిచిన మజిలీస్ తోనే మళ్ళీ ఇప్పుడు దోస్తీ కట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టినందుకు రెడీ అయింది. సానియా మీర్జా, నాంపల్లి లీడర్ ఫిరోజ్ ఖాన్ లాంటి బలమైన అభ్యర్థుల పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. చివరికి ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో మజిలీస్ కు మేలు చేయాలని అనుకుంటుందట కాంగ్రెస్.

 ఈ క్రమంలోనే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటుందట. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో దోస్తీ కట్టేందుకు సిద్ధమైన ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కు క్రమక్రమంగా దూరం జరుగుతుంది అన్నవి తెలుస్తోంది. కాగా బిజెపి అభ్యర్థి కొంపల్లి మాధవి లత నుంచి గట్టి పోటీ ఉంది అని ఎంఐఎం పార్టీ భావిస్తుందట  ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలంటూ ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ ను విజ్ఞప్తి చేశాడట   హైదరాబాద్లో తమకు సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను కాంగ్రెస్కు వచ్చేలా చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అందుకే పలువురు ముస్లిం నేతల పేర్లు తెరమీదకి వచ్చినప్పటికీ.. చివరికి హైదరాబాదులో బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: