చంద్రబాబు: ఆయన్ను డీజీపీ చేసేందుకు ఎత్తులు?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటాయి. లాభం లేకుండా ఏ పని చేయరు. ఎవరితో మాట్లాడరు. ప్రస్తుతం అటు జనసేనతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నారు. జగన్ ను ఢీకొట్టాలంటే తన శక్తి సరిపోదని భావించిన ఆయన..ముందుగా జనసేనను చేరదీశారు.  ఆ తర్వాత పవన్ ను అడ్డు పెట్టుకొని తమ జట్టులోకి బీజేపీని తీసుకువచ్చారు.

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఆరు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం సాధారణ విషయం ఏమీ కాదు.  దీనికి కారణాలు లేకపోలేదు. ముందు ఆయనకు బీజేపీతో పొత్తు కావాలి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అండ ఉంటే రాష్ట్రంలో అధికారులు తమ మాట వింటారు. చెప్పు చేతల్లో ఉంటారు.

లేకపోతే వారిని బదిలీ చేయించవచ్చు. తమ పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించవచ్చు. ఈ కారణం చేతనే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అనుకున్నది సాధించగలుగుతున్నారు. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లపై ఫిర్యాదు చేసి వారిని బదిలీ చేయించారు. ప్రస్తుతం ఆయన తదుపరి లక్ష్యం సీఎస్, డీజీపీలు.

ప్రస్తుత డీజీపీ స్థానంలో తన అనునూయిడు ఏబీ వెంకటేశ్వరరావును నియమించాలని చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి ఆ పార్టీకి ఎంత మేర లబ్ధి చేకూర్చారో అందరికీ తెలిసిందే.  ప్రస్తుతం ఆయన పదవీకాలం మే 31తో ముగుస్తుంది. కొత్త ప్రభుత్వం జూన్ 4 న ఏర్పడుతుంది. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే ఏదో ఒకటి చేసి ఆయన పదవీ కాలాన్ని పొడగించవచ్చు. ప్రస్తుత డీజీపీపై ఫిర్యాదులు చేసి ఎలాగైనా పదవి నుంచి తొలగించి.. ఏబీవీని నియమించాలి. ఇదే ప్రస్తుత టీడీపీ లక్ష్యం. మరి నెరవేరుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: