ఓటర్లకు చేతికి వేసే సిరా వెనుక ఇంత సీక్రెట్ ఉందా. ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా మరికొన్ని రోజుల్లో జరగబోతూ ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. అయితే ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఇక అన్ని పార్టీల నాయకులు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించడానికి సరికొత్త కారణాలను వెతుక్కునే పనిలో ఉంటారు.

 ఇక పార్టీ జెండాలతో ప్రచారాలు.. హామీల వర్షాలు.. ర్యాలీలు, భారీ బహిరంగ సభలు,  ప్రసంగాలు ఇలా ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంకొంతమంది ఇక ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మరో విషయంపై కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అదే ఓటు వేసినప్పుడు ఇక ఓటర్ చేతి వేలికి వేసే సిరా గురించి. ఎందుకంటే సాధారణంగా ఏదైనా సిరా వేస్తే తుడుచుకుంటే చెరిగిపోతుంది. ఒకవేళ అలా చెరిగిపోకపోతే సబ్బుతో కడిగితే ఎంతో ఈజీగా తొలగిపోతుంది.

 కానీ ఎన్నికల సమయంలో ఓట్లు వేసినప్పుడు చేతి వేలికి వేసే సిరా మాత్రం ఎంత ప్రయత్నించినా తొలగిపోదు. దీంతో ఈ సిరాను దేనితో తయారు చేస్తారా అనే విషయంపై అందరికీ ఒక అనుమానం ఉంటుంది. కాగా కర్ణాటకలోని మైసూర్ పెయింట్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీలో ఈ సిరాను తయారు చేస్తారట. దీని తయారీ ఫార్ములాను ఎంతో రహస్యంగా ఉంచుతారట  అయితే అక్కడ పనిచేసే కేవలం ఇద్దరు కెమిస్ట్ లకు మాత్రమే దీని ఫార్ములా తెలుస్తుందట.  వారు తమ రిటైర్మెంట్ సమయంలో నమ్మకస్తులైన తర్వాత ఉద్యోగులకు మాత్రమే ఇక ఈ సీక్రెట్ ను బదిలీ చేస్తారట. కాగా ఈ ఎన్నికల కోసం 55 కోట్ల రూపాయల విలువైన 26.5 లక్షల సిరా వయల్స్ ని వినియోగించబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: