ఒకే ఒక్క డైలాగ్‌తో కాసుకు య‌ర‌ప‌తినేని ద‌మ్మున్న స‌వాల్‌..!

RAMAKRISHNA S.S.
ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో డిఫ‌రెంట్ రాజ‌కీయాల‌కు తెర‌దీసిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు,  గుర‌జాల మాజీ ఎమ్మెల్యే  య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప్ర‌త్య‌ర్తి, వైసీపీ నాయ‌కుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డికి సంచ‌ల‌న స‌వాల్ రువ్వారు. `నేను సిద్ధం.. మ‌రి నువ్వు` అంటూ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం డిఫెరెంట్‌గా నిలిచింది. ఇక్క‌డ పోటీలో ఉన్న య‌ర‌ప‌తినేని కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల‌కు తోడు తాను కూడా కొన్ని ప్ర‌క‌టించారు.
స్థానికంగా ఉన్న స‌మ్య‌ల‌తోపాటు.. త‌న‌ను గెలిపిస్తే ఏం చేస్తాన‌నే విష‌యాన్ని య‌రప‌తినేని తేల్చి చెప్పా రు. అయితే.. ఇదేస‌మ‌యంలో కాసు కూడా.. సొంత అజెండాతో ఆయ‌న మేనిఫెస్టో జారీ చేశారు. మొత్తంగా ఈ ఇద్ద‌రు నేత‌లు కూడా.. రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా సొంత మేనిఫెస్టోలు, హామీలు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు య‌ర‌ప‌తినేని ఇచ్చిన సొంత మేనిఫెస్టోపై కాసు వ‌ర్గం విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇవ‌న్నీ అయ్యేవి కావ‌ని పేర్కొంది. దీనిని క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేస్తోంది.
అయితే.. దీనికి కౌంట‌ర్‌గా య‌ర‌ప‌తినేని కాసుకు స‌వాల్ విసిరారు. `నీ మేనిఫెస్టోపై నేను విమ‌ర్శ‌లు చేయ లేదు. నేను సొంత‌గా ఇచ్చిన మేనిఫెస్టోపై నువ్వు విమ‌ర్శ‌లు చేస్తున్నావు. ఎవ‌రు ఈ గుర‌జాల నియోజ‌క వ‌ర్గానికి ఏం చేశార‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలుసు. పోనీ.. రాజ‌కీయాల్లో ఇప్పుడు ఎవ‌రు గెలిస్తారో.. రెండో వారు.. రాజ‌కీయ స‌న్యాసం తీసుకునేందుకు రెడీ. నేను ఓడిపోతే ఇక‌, రాజ‌కీయాల‌ను వ‌దిలేస్తా. నువ్వు కూడా వ‌దిలేస్తావా?  ఇదే నేను విసిరే స‌వాల్‌` అని య‌ర‌ప‌తినేని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. కాసు బ్రాహ్మానంద‌రెడ్డి కుటుంబానికే చెందిన వ్య‌క్తివైతే.. ఈ స‌వాల్‌కు స్పందించాల‌ని య‌ర‌ప తినేని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఓడిపోతే.. రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతావా? అని ప్ర‌శ్నించారు. స‌వాల్ స్వీక‌రిస్తుంటే.. గంట‌లోగా మీడియా ముందుకు వ‌చ్చి స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. లేక‌పోతే.. నోరు మూసుకుని నీ ప‌నినువ్వు చేసుకోవాల‌ని తేల్చి చెప్పారు. మ‌రి దీనిపై కాసు ఎలా రియాక్ట్ అవుతార‌నేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: