ఏపీ : చంద్రబాబు స్టైలే వేరు.. మద్యమే సంపద అనుకుంటున్నట్టున్నాడా?

praveen
పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రాలోని అన్ని పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో బిజీబిజీగా ఉన్నాయి. అంతేకాదు ప్రచార రంగంలో దూసుకుపోతూ తమను గెలిపిస్తే ఏం చేస్తాం అనే విషయంపై హామీల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. అయితే జగన్ను గద్దె దింపి సీఎం కూర్చొని దక్కించుకోవాలి అనుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబు.. ఇక తమ పార్టీని గెలిపించి అధికారాన్ని కట్టబెడితే.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ హామీలు ఇస్తున్నారు. అంతేకాదు ఎలాంటి పథకాలను ప్రవేశపెడతాం.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం అనే విషయంపై కూడా.. హామీల వర్షం కురిపిస్తూ ఓటరు మహాశయులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 అదే సమయంలో ఒకవైపు ఆంధ్రాలో రెండోసారి అధికారాన్ని చేపట్టేందుకు ఒంటరిగా బరిలోకి దిగిన వైసిపి ప్రచార రంగంలో దూసుకుపోతూనే.. అటు ప్రతిపక్ష టీడీపీ ఇస్తున్న హామీలపై సెటైర్లు వేస్తూ ఉంది. ఇలా అన్ని పార్టీలు ఒకరి హామీలపై ఒకరు సెటైర్లు వేసుకోవడం కూడా ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల ప్రచారం చేస్తున్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక హామీపై వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ సెటైర్ వేశారు. తాను అధికారంలోకి వస్తే మద్యం ధరలను తగ్గిస్తాం అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.

 అయితే ఇదే విషయాన్ని టార్గెట్  చేస్తూ మాట్లాడిన వైసిపి నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బాధ్యత కలిగిన నాయకులు బియ్యం,పప్పు, ఉప్పు, వంట నూనెల ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం చూసాము. కానీ చంద్రబాబు స్టైలే వేరు... తనను గెలిపిస్తే మద్యం ధరలను తగ్గిస్తానని హామీ ఇచ్చి.. ముసి ముసిగా నవ్వుకున్నాడు. అంటే చంద్రబాబు దృష్టిలో సంపద అంటే మద్యమేనేమో  అంటూ విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ఏకంగా మద్యం ధరలను భారీగా పెంచి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. కానీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేక పోయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: