ఖమ్మం : కన్ఫ్యూషన్ లో కాంగ్రెస్.. మరి క్లారిటీ వచ్చేదెప్పుడు?

praveen
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే మిగతా పార్టీలతో పోల్చి చూస్తే కాస్త ముందుగానే ఇక ఆయా పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు జాబితాను ప్రకటించింది. అయితే ఇప్పటికీ మూడు పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం అందరిని కన్ఫ్యూషన్ లో పడేసింది. మరి ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు టికెట్టు ఎవరికి కేటాయించబోతుంది అనే విషయంపై ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది.

 అయితే కాంగ్రెస్ కంచుకోటగా పిలుచుకునే ఖమ్మంలో ఇక ఎంతో సులభంగా గెలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇక కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని ఇక్కడ బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లారు ఆ తర్వాత కనీసం అటు ప్రియాంక గాంధీతో అయిన ఇక్కడి నుంచి పోటీ చేయించాలి అనుకున్నారు. కానీ ఆమె పోటీ చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఒకవేళ వాళ్ళు ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే.. ఇక టికెట్ తమకే రావాలి అంటూ మరి కొంతమంది పార్టీలోని కీలక నేతలు పట్టుపట్టారు  ఇప్పటివరకు ఖమ్మం అభ్యర్థి వీరే అంటూ డజన్కు పైగా పేర్లు వినిపించాయ్. ఇక ఇప్పుడు మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా వినిపిస్తోంది.

 మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అర్జున భర్జన తర్వాత ఇలా మంత్రుల కుటుంబ సభ్యులకు ఛాన్స్ వచ్చే అవకాశం లేదని తేలింది. అయితే ఒక మాజీ మంత్రి అల్లుడు దగ్గరనుంచి బీసీ నేతల వరకు చాలామంది పేర్లను అధిష్టానం పరిశీలించిందట. చివరికి మొన్న టిడిపిని వదిలి కాంగ్రెస్ లో చేరిన నందమూరి సుహాసిని పేరు కూడా తెరమీదకి వచ్చింది  ఇక ఇటీవల నిజాంబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరమీదికి రావడం గమనార్హం.


పార్లమెంట్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించనందున ఇక ఖమ్మం సీటు మండవకే ఇవ్వాలి అన్న ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఈ టికెట్ రేస్ లో పారిశ్రామికవేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఖమ్మం టికెట్ ఎవరికీ కేటాయిస్తారు అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. కాగా నేడు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. ఇక పార్టీ పెద్దలతో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: