యేటికి ఎదురీదటం అంటే ఇదే.. బీజేపీ ఆమెను మరీ ఎక్కువ నమ్మేసిందా?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఒక లోక్ సభ నియోజకవర్గంలో  ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు  ఆ పార్టీ నుంచి మరో పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించిన దాఖలాలు కూడా లేవు. అందుకే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ను ఎంఐఎం కంచుకోట అని పిలుస్తూ ఉంటారు. ఇక మిగతా పార్టీలు కూడా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో గెలుపును లైట్ తీసుకుంటూ డమ్మి అభ్యర్థులను ప్రకటిస్తాయి అనే వాదన కూడా తెలంగాణ రాజకీయాల్లో ఉంది.

 అయితే హైదరాబాద్లో తప్పకుండా ఓవైసీ ని ఓడించి తీరుతాం అంటూ బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఎంఐఎం ను ఢీకొట్టేందుకు మాధవి లతను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రాజకీయాల్లో జుట్టు పండిన మహా ఉద్దండులకే హైదరాబాద్లో ఎంఐఎం పై విజయం అసాధ్యమైన పని. అలాంటిది అప్పటివరకు ఏ పార్టీలోని లేని.. కనీసం రాజకీయ అనుభవం లేని మాధవి లత ఎంఐఎం ను ఢీకొట్టడం అంటే యేటికి ఎదురీదడమే అనే భావన చాలామందిలో ఉందట. అయితే అభ్యర్థిని ప్రకటించే నాటికి మాధవి లత ఏ పార్టీలో లేరు. కనీస బిజెపిలో కూడా లేరు కానీ సీట్ తెచ్చుకున్నారు.

 డబ్బు పలుకు బడితో పాటు యూట్యూబ్ వీడియోలలో ఆమె ఇంటర్వ్యూలు బాగా వైరల్ కావడంతో పాపులారిటీ వచ్చింది. అయితే ఇక ముందు నుంచి టార్గెట్ పెట్టుకొని బిజెపి టికెట్ కోసమే ఇలా ఇంటర్వ్యూలలో మాట్లాడారేమో అని అనుమానం కూడా చాలా మందికి ఉంది.  అయితే యూట్యూబ్ చూసేవారికి మినహా ఎంత మందికి ఆమె తెలుసు అనేది కూడా ఒక డౌట్. ఇంకోవైపు ఓవైసీ జాతీయ స్థాయి నాయకుడు. ముస్లిం ప్రతినిధిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.


 అయితే ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా మాధవి లతను ప్రకటించిన తర్వాత బిజెపి అనుకూల మీడియా ఆమెకు పబ్లిసిటీ తెచ్చేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఆమెకు ఇప్పుడు వైప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించారు. అయితే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పలు ఇంటర్వ్యూలో మాధవి లత చేస్తున్న వ్యాఖ్యలు ట్రోల్స్ కి గురవుతున్నాయి. దీంతో ఓవైసీకి పోటీ ఇచ్చి ఓడిస్తుంది అనుకుంటే చివరికి ఓవైసీ కి పోటీ లేకుండా గెలిపించే ప్రత్యర్థిగా మారిందని కొంతమంది అనుకుంటున్నారట. ఓవైసీని ఓడించాలనుకుంటే మరో బలమైన అభ్యర్థిని బిజెపి వెతుక్కుని ఉంటే  బాగుండేది కానీ మాధవి లతను బిజెపి ఎక్కువగా నమ్మేసింది అని హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లే కొంతమంది అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: