ద‌ర్శికి ' ల‌క్ష్మి ' లా వ‌చ్చింది... టీడీపీకి విక్ట‌రీ క‌ళ వ‌చ్చేసింది...!

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ద‌ర్శి. ఇక్క‌డ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 15 ఎన్నిక‌ల్లోనూ ఎప్పుడూ.. మ‌హిళా అభ్య‌ర్థిపోటీ చేసిన దాఖ‌లాలు లేవు. అయితే తొలిసారి డాక్ట‌ర్ ల‌క్ష్మి ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు. వాస్త‌వానికి ద‌ర్శి అంటే.. ఉన్న‌త విద్యావంతులు.. వ్యాపార వేత్త‌లు పోటీ ప‌డుతుంటారు. ఈ సారి కూడా ఇక్క‌డ ఇదే సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. వైసీపీ నుంచి డాక్టర్ బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో టీడీపీ కూడా అనేక మంది ఆశావ‌హులు పోటీలో ఉన్నా.. డాక్ట‌ర్ గొట్టిపాటి ల‌క్ష్మికి అవ‌కాశం క‌ల్పించింది. ఇక్క‌డ ఇద్ద‌రు డాక్ట‌ర్లే ఫ‌స్ట్ టైం పోటీ ప‌డుతున్నారు. ఒక వైసీపీ జంట్ డాక్ట‌ర్‌పై టీడీపీ లేడీ డాక్ట‌ర్ సివంగిలా దుమికి ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో ఢీ కొట్ట‌బోతున్నారు. ఇక‌, ఈమె రాజ‌కీయ వార‌స‌త్వం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు కొత్త‌కాదు. మామ క‌డియాల వెంక‌టేశ్వ‌రావు నుంచి తాత గొట్టిపాటి హ‌నుమంత‌రావు, తండ్రి గొట్టిపాటి న‌ర‌స‌య్య వ‌ర‌కు అంద‌రూ ప్ర‌జ‌ల మ‌నుషులుగా ఓ వెలుగు వెలిగిన వారే.

ఇక‌, ఈమె బాబాయి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కుమార్ కూడా.. బ‌ల‌మైన నాయ‌కుడిగా వ‌రుస విజ‌యాలు అందుకున్నారు. వైసీపీ హ‌వాలోనూ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకు న్నారు. ఇక‌, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తొలిసారి రంగంలోకి దిగిన డాక్ట‌ర్ ల‌క్ష్మి.. వృత్తి ప‌రంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు  వైద్యురాలిగా ఉన్నారు. అయితే.. చంద్ర‌బాబు ఇచ్చిన అవ‌కాశంతో ఆమె రాజ‌కీయ రంగంలోకి దిగారు. ఇది ఆమెకు తొలి ప్ర‌య‌త్నం. అయితే.. ఆమె చాలా నిబ్బ‌రంగా.. ధైర్యంగా పోటీలో ఉండ‌డం గ‌మ‌నార్హం. దీని కికార‌ణం.. క‌డియాల కుటుంబ‌మే అయినా.. గొట్టిపాటి కుటుంబ‌మే అయినా.. ప్ర‌జ‌ల‌కు నీతి, నిజాయితీతో ప‌నులు చేయ‌డం.. ఆద‌ర్శంగా జీవించ‌డ‌మేన‌ని ల‌క్ష్మి చెబుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ పాల‌న‌లో ఎలాంటి అభివృద్ది జ‌ర‌గ‌క‌పోవ‌డం.. అవినీతి పెరిగి పోవ‌డం వంటివి త‌న‌కు క‌లిసి వ‌స్తాయ‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌.. రాష్ట్ర అభివృద్ధి అనే నినాదాల‌తో ముందుకు సాగుతున్న‌ట్టు తెలిపారు. త‌న‌కు పార్టీ కార్య‌క‌ర్త‌ల బ‌లంలో పాటు.. కూట‌మి పార్టీల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని బ‌లంగా చెబుతున్నారు. ప‌శ్చిమ ప్ర‌కాశంలో బాగా వెన‌క‌ప‌డిన ప్రాంత‌మైన ద‌ర్శిలో కుటుంబాలు రాజ‌కీయాలు చేస్తూ వ‌స్తున్నా ఇక్క‌డ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఉన్నంత‌లో 2014లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక మాత్ర‌మే ఆ ఐదేళ్ల‌లో కాస్తో కూస్తో అభివృద్ధి జ‌రిగింది.

ఇక్క‌డ ప్ర‌స్తుత ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ను వైసీపీ పెత్తందారులు ఎలా ఇబ్బంది పెట్టారు అన్న చ‌ర్చ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌ద్దిశెట్టిని ల‌క్ష్మి క‌ల‌వ‌డం.. మ‌ద్దిశెట్టి కూడా ల‌క్ష్మికి త‌న మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో టీడీపీలో మ‌రింత జోష్ క‌నిపిస్తోంది. త‌న రాజ‌కీయ అరంగేట్రం వెనుక‌.. నియోజ‌క‌వ‌ర్గానికి మేలు చేయాల‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న రెండు ల‌క్ష్యాలే ఉన్నాయ‌ని ల‌క్ష్మి చెబుతున్నారు. పార్టీలోను.. కూట‌మి పార్టీల్లోనూ అంద‌రినీ క‌లుపుకొని పోతామ‌ని.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా చేరువ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని ఆమె చెబుతున్నారు. మ‌రి డాక్ట‌ర్ ల‌క్ష్మి ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు క‌లిసి వ‌స్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: