ఓటేస్తే హెయిర్ కట్ ఫ్రీ.. వినూత్నమైన ఆఫర్?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఇక అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి  ఈ క్రమంలోనే పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి అని చెప్పాలి. అయితే అటు ఓటర్లు అందరూ కూడా తమకు నచ్చిన అభ్యర్థిని.. ఎన్నుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ఓటర్లు మాత్రం ఇంకా ఓటు ఆవశ్యకత గురించి తెలియక.. ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు.

 ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటు హక్కును వినియోగించుకోకుండా.. సైలెంట్ గానే ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత.. ఓటు యొక్క పవర్ ఏంటి అన్న విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు ఇక అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంటారు   అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది వ్యక్తులు సైతం స్వచ్ఛందంగా  ఇలా ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో ప్రయత్నాలు చేయడం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక సెలూన్ యజమాని కూడా ఇలాంటిదే చేశాడు.

 ఓటు హక్కు పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక వినుతమైన ఆఫర్ ప్రకటించాడు  లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి తన సెలూన్ లో ఉచితంగా హెయిర్ కట్ చేస్తాను అంటూ ప్రకటించాడు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అనే ఒక సెలూన్ యజమాని.  ఈ ఆఫర్ ప్రకటించాడు. ఓటేసి వచ్చి వేలికి సిరారంగు చూపిస్తే ఫ్రీగా కటింగ్ చేసుకోవచ్చు అంటూ షాపు ముందు ఒక బోర్డును కూడా పెట్టాడు. కాగా రెండో విడతలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది స్థానాలకు ఈనెల 26వ తేదీన పోలింగ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇలా ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపేందుకు సదరు వ్యక్తి చేస్తున్న ప్రయత్నం పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: