ఏపీ: వైసీపీ కార్యకర్తలనే చితకబాదిన ఎస్ఐ కట్ చేస్తే..??
ఏప్రిల్ 10న చైతన్య అనే ఎస్సై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను స్టేషన్‌కి తీసుకువెళ్లి చితక్కొట్టారు. సాధారణంగా ఎలక్షన్ వస్తున్నాయని అనగానే బైండోవర్ కావాలని కొందరికి పోలీసులు ఆదేశాలు ఇస్తారు. అంటే ఎవరిపైనైతే కేసులు ఉన్నాయో వారందరినీ పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుంటారు. అంతేకాదు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. వారందరితో మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ పనులకు పాల్పడవద్దని రాయించుకుంటారు. అసలు ఎన్నికల ప్రచారాల్లోనే పాల్గొన వద్దని కూడా ఆదేశిస్తారు. అలానే ఎన్నికల సమయంలో వారు బయటకి వెళ్లకుండా పోలీసులు వారి ఇండ్ల ముందు నిఘా కూడా ఉంచుతారు. వెళ్లినవారు తీవ్రమైన పర్యవసానాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను కూడా చైతన్య చితక్కొట్టారు. ఆ సమయంలో మాజీ మంత్రి రవీంద్ర పోలీసులపై విరుచుకుపడ్డారు కార్యకర్తలను కొట్టే హక్కు మీకు ఎక్కడిది అని నిలదీశారు. ఇప్పుడేమో వైసీపీ కార్యకర్తలని చైతన్య కొట్టగా మంత్రి పేర్ని నాని పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి పెద్ద రచ్చ సృష్టించారు. కొట్టే హక్కు మీకు ఎక్కడిదని ఆయన కూడా సేమ్ క్వశ్చన్ వేశారు. అయితే టీడీపీ కార్యకర్తలను కొట్టినప్పుడు వైసీపీ మంత్రులు ఎవరూ మాట్లాడలేదు. వారిని కొట్టడం రైటే అన్నట్టు ప్రవర్తించారు.
కానీ ఇప్పుడు మాత్రం బాగా మండిపడుతున్నారు. ఇది తప్పు అన్యాయం అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కూడా తమ వారిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ సదరు కార్యకర్తలు చేసే దందాలు, అరాచకాలు వీరికి కనిపించవా? వాటిని విస్మరించి పోలీసులను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రస్తుతం సామాన్య ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న.
ఇకపోతే సాధారణంగా పోలీసు అధికారులు అధికారంలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తల జోలికి అసలు వెళ్ళరు. వారికే తమ సపోర్టుని అందిస్తారు కూడా. కానీ ఎస్ఐ చైతన్య మాత్రమే ఎవరు తప్పు చేస్తే వారిని శిక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వైసీపీ వారిని కొట్టడం వల్ల అతను ఎలాంటి ప్రతిఫలాన్ని ఫేస్ చేస్తారో చూడాలి..