ఏపీ : ఉద్యోగాలు కావాలా.. గంజాయి కావాలా.. మీరే డిసైడ్ చేసుకోండి?

praveen
రాజకీయ ఉద్దండుడిగా, పొలిటికల్ మాస్టర్ మైండ్ గా పిలుచుకునే చంద్రబాబు ఇక ఇప్పుడు ఆంధ్రలో సీఎం కూర్చొని దక్కించుకోవడమే  లక్ష్యం గా పావులు కదుపుతున్నాడు. వైసీపీతో ఒంటరిగా పోరాడి గెలవలేం అని ముందుగానే అర్థం చేసుకున్న చంద్రబాబు... ఇక జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ కూటమి లో సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే. వైసీపీని చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రచార రంగం లో చంద్రబాబు దూసుకుపోతున్నారు.
 వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో  సక్సెస్ అవుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువతను మోసం చేసిందని.. కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైందని.. అధిక కరెంటు బిల్లు కారణంగా పేదలు చీకట్లోనే బ్రతికే పరిస్థితిని తీసుకువచ్చిందని.. జగన్ ప్రభుత్వ హయాంలో యువత మొత్తం గంజాయి మత్తులోనే ఊగుతుంది అంటూ వైసిపి ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు సిబిఎన్. అయితే ఇటీవలే ప్రచారంలో భాగంగా జగన్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జగన్ ఓడించేందుకు టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు కలిసాయి. ఇక వైసిపికి డిపాజిట్లు కూడా వస్తాయా.. యువత కర్నేర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతారు.. మీరే చెప్పండి మీకు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా.. యువతకు ఉద్యోగాలు కావాలో లేకపోతే గంజాయి మత్తు కావాలో.. మీరే ఆలోచించుకోండి అంటూ టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.


మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు టిడిపి అధినేత చంద్రబాబు. ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడాడు. అక్రమాలు వ్యక్తిగత దాడులను తట్టుకొని మరి పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు  అంటూ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: