చేవెళ్ల : బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమట?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. ఇక ఇప్పటికే ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి భంగపాటుకు గురైన బీఆర్ఎస్ పార్టీ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ నేతలు అందరిలో ఆత్మవిశ్వాసం నింపాలని అనుకుంటుందట. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా అటు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు.

 ఈ క్రమంలోనె రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది. ఎంతమంది ఇంకా కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారు అనే విషయంపై కారు పార్టీలో ఉన్న మిగతా నేతలు అంతర్మదనం మొదలైంది. ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మెజారిటీ స్థానాలలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ.  ఇక చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఏకంగా హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ చేశాడట.ఈ క్రమంలోనె అపారమైన రాజకీయ అనుభవం ఉన్న బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అక్కడి నుంచి బరిలోకి దింపారు. ఇక చేవెళ్లలో కాసాని గెలవడం ఖాయమని బిఆర్ఎస్ శ్రేణులు కూడా అనుకుంటున్నారట.

 రెండుసార్లు బీఆర్ఎస్ చేవెళ్లలో విజయం సాధించింది. 2014లో కొండా విశ్వేశ్వర్ ఈ పార్టీ నుంచి గెలిచారు. ఇలా గెలిచిన తర్వాత ప్రజలు ఆయనను కలిసేందుకు వెళ్తే.. అపాయింట్మెంట్ ఉందా అని అడగడం.. ఇంటికి ఎవరూ రావద్దు అంటూ అటు నుంచి అటే బయటికి పంపించడం చేయడంతో ఆయనకు ప్రజల్లో వ్యతిరేకత ఉందట. ఇంకోవైపు ఏకంగా రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పార్టీకి మోసం చేసినా రంజిత్ రెడ్డి పై కూడా ఈసారి చేవెళ్ల ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారట.

 అయితే గతంలో రంజిత్ రెడ్డికి మద్దతు ఇచ్చిన పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం కూడా రంజిత్ రెడ్డికి మద్దతు ఇవ్వరని ప్రచారం కూడా ఉంది. దీంతో కాంగ్రెస్, బిజెపి నుంచి పోటీలోకి దిగిన ఇద్దరు అభ్యర్థులకు కూడా చేవెళ్ల ప్రజలు గట్టి షాకిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అనుకుంటున్నారట. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టు ఉంది. అయితే కాసానికి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు సేవా గుణం వల్ల ఒక మంచి పేరు ఉంది. ఇక స్థానికుడు కావడం మరో కలిసొచ్చే అంశమే. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా కాసాని సుపరిచితులు కావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించటం ఖాయమని గులాబీ పార్టీ బాస్ కేసిఆర్ అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: