ఇదేం ప్ర‌చారం సామీ... అనంత అర్బ‌న్‌లో టీడీపీ ' ద‌గ్గుబాటి ప్ర‌సాద్ ' న‌యా స్టైల్ ఇది..!

RAMAKRISHNA S.S.
ఎన్నిక‌ల స‌మ‌యంలో పోటీ చేసే అభ్య‌ర్థులు ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు అనేక హామీలు ఇస్తుంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి ఇవి సక్సెస్ అవుతాయి. మ‌రికొన్నిసార్లు బూమ‌రాంగ్ అవుతుంటాయి. ఇక‌, అనంత పురం జిల్లా అర్బ‌న్ టికెట్‌ను  ద‌క్కించుకున్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, డీవీ పాలిమ‌ర్స్ అధినేత ద‌గ్గుబా టి ప్ర‌సాద్‌.. ఇలానే కొన్ని హామీలు ప్ర‌క‌టిస్తున్నారు. ఈయ‌న‌కు సొంత పార్టీలోనే వ్య‌తిరేక‌త ఎదుర‌వుతు న్న విష‌యం తెలిసిందే.
అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్ర‌భాక‌ర చౌద‌రిని కాద‌ని చంద్ర‌బాబు ఈయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా.. ద‌గ్గుబాటి ప్ర‌సాద్‌కు మొగ్గు చూపారు. దీంతో తొలినాళ్ల‌లో కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మై నా.. చంద్ర‌బాబు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక‌, ఈ ప్ర‌చారానికి వైకుంఠం దూరంగా ఉంటున్నారు. ఆయ న అనుచ‌రులు కూడా ఎక్క‌డా పాల్గొన‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. చోటా నేత‌ల‌ను వెంట పెట్టుకుని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో రెండు కీల‌క హామీల‌ను ప్ర‌సాద్ ప్ర‌చారం చేస్తున్నారు.
1)  `నా ఫోన్ నెంబ‌ర్ ఇదీ.. మీరు మీ పోన్ల‌లో ఫీడ్ చేసుకోండి. అర్ధ‌రాత్రి అయినా.. మిట్ట‌మ‌ధ్యాహ్నం అయినా.. మీకు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. నేరుగా నాకు పోన్ చేయండి. త‌క్ష‌ణం మీ ముందు వాలిపోతా. నేను వైసీపీ ఎమ్మెల్యే మాదిరిగా కాదు. పారిపోను. ఇక్క‌డే ఉంటా` అంటూ ప్ర‌సాద్ ప‌దే ప‌దే చెబుతున్నా రు. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌పై స‌టైర్లు వేస్తున్నారు. అర్ధ‌రాత్రి పూట వ‌చ్చి ఏం చేస్తారు స‌ర్‌. ఆ చేసేదేదో.. ప‌గ‌లు పూటే చేయండి చాల‌ని అంటున్నారు.
2) `నగరం నేడు ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉందంటే.. దీనికి కారణం వైసిపి నాయకులే. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని మరిచిపోయారు. మేం అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు డంపింగ్ యార్డ్ ను తరలించడమే తొలి కర్తవ్యంగా తీసుకుంటాం`  అని వ్యాఖ్యానించారు.  
అయితే.. దీనిపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వొద్దు స‌ర్.. అంటున్నారు. ఇక, ప్ర‌సాద్ ప‌ర్య‌ట‌న‌లో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు, మాజీ కార్పొరేటర్ రాజారావు వంటి వారే కీల‌క నేత‌లుగా మార‌డంతో పెద్ద‌గా ఊప‌యితే క‌నిపించ‌డం లేదు. ఎలా చూసుకున్నా వైకుంఠం స‌హ‌కారం లేక‌పోతే.. ఇబ్బందేన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: