ఏపీ : తెలంగానోళ్లు.. ఆంధ్రాలో ఓటెయ్యబోతున్నారట?

praveen
ప్రస్తుతం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందేమో అనేంతలా వేడెక్కింది. ప్రతిపక్ష అధికార పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అదే సమయంలో ఎప్పటిలాగానే ఎన్నికల సమయంలో కనిపించే పార్టీ ఫిరాయింపులు కూడా ఆంధ్ర రాజకీయాల్లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే అటు టిడిపి జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఇక సీట్ల కేటాయింపులో సర్దుబాటు చేసుకుని మరి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కానీ సీఎం జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు.

 అయితే ఆంధ్ర రాజకీయాల్లో  ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా దొంగ ఓట్ల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఈ విషయం అటు అన్ని పార్టీలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా  చాలామంది ఆంధ్ర నుండి అటు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడే ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ సెటిల్ అయిన వారు ఉంటారు. దీంతో ఇక్కడ ఓటు హక్కు కూడా కలిగి ఉంటారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇలా ఓటు హక్కుతో తెలంగాణలో ఓటు వేసి కూడా మళ్ళీ ఆంధ్రాలో కూడా ఓటు హక్కు ఉండడం కారణంగా ఇక్కడ ఓట్లు వేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి విషయంపై గతంలో ఏపీ సీఎం జగన్ కాస్త గట్టిగానే దృష్టిపెట్టారు.

 ఇలా తెలంగాణలో ఓట్లు ఉండి ఆంధ్రాలో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి ఓటు హక్కును ఏపీలో తొలగించేందుకు అప్పట్లో జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఇక ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఓట్లు నమోదు అవుతున్నాయట. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16వ తేదీ నుంచి ఈ నెల రెండవ తేదీ వరకు  కేవలం 17 రోజుల్లోనే దాదాపు రెండు లక్షల  మంది ఓట్లు నమోదు చేసుకున్నారట. ఇలా కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న వారందరూ కూడా ఒకప్పుడు తెలంగాణలో ఓటు హక్కు ఉండడం కారణంగా ఆంధ్రాలో ఓటు హక్కు లేకుండా తొలగించబడిన వారేనట. మరి ఆంధ్రలో ఈ కొత్త ఓట్ల నమోదు వ్యవహారం ఎవరికి ప్లస్ పాయింట్ గా మారుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: