ఏపీ: ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న జగన్‌కి భారీ షాక్..??

Suma Kallamadi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎలక్షన్లలో కూడా విజయ బావుటా ఎగరవేయాలని ఆశతో రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేస్తున్నారు. ఆయన యాత్రకు ఎక్కడికి వెళ్ళినా విశేషమైన స్పందన లభిస్తోంది. ఇటీవల జగన్ ప్రకాశం జిల్లాలో బస్సుయాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రలో జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. దాంతో జగన్ కి భారీ షాక్ తగిలినట్లు.
జగన్ బస్సుయాత్రలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. జగన్‌కు దమ్ కి ఇచ్చేందుకు మహీధర్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లగా, వేణుగోపాల్ బెంగళూరుకు వెళ్లారు. వారు లేకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ టిక్కెట్లు రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.  జగన్ పర్యటనలో వారు లేకపోవడం గమనార్హం.
* సాయంత్రం మీటింగ్, మరిచిపోయిన వాగ్దానాలు
ఆదివారం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల జంక్షన్‌లో వైసీపీ బహిరంగ సభకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు.  ఓట్లను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన సభ జరగనుంది అయితే, ప్రకాశం జిల్లా సవాళ్లను ఎదుర్కొంటుంది. గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకముందే ప్రారంభం కావడంతో నిర్వాసితులకు పరిహారం లేకుండా పోయింది.
గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది. కానీ జగన్ నిర్వాకంపై పెద్దగా పట్టించుకోలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీలో పురోగతి లేదు. ట్రిపుల్‌ ఐటీ కళాశాల నిర్మాణం పూర్తయినా మార్కాపురంలో వైద్య కళాశాల మాత్రం నిలిచిపోయింది. దొనకొండ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం ఎదురుచూస్తోంది. కేంద్రం ఆఫర్ చేసినా కనిగిరిలో నిమ్జ్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. దర్శిలోని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను కూడా జగన్ పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ప్రకాశం జిల్లా నుంచి ఓట్లు అడుగుతున్నారు. కానీ ఈ జిల్లాలో తక్కువగానే ఓట్లు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు స్థానిక ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడం ద్వారా ప్రజల నుంచి ఎక్కువ ఓట్లను పొందవచ్చు. లేదంటే కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: