ఏపీ : జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీలో జరగబోయేది ఇదేనా?

Reddy P Rajasekhar
2019 సంవత్సరం మే నెల 23వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలలో 151 ఎమ్మెల్యే స్థానాలతో, 22 ఎంపీ స్థానాలతో వైసీపీ సంచలనాలు సృష్టించింది. ఎన్నికల్లో జగన్ సాధించిన రికార్డ్ బ్రేక్ కావడం అసాధ్యమని పొలిటికల్ వర్గాల్లో వినిపించింది. 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగన్ భావిస్తుండగా 120కు పైగా స్థానాలతో  వైసీపీకి విజయం సొంతమవుతుందని ఆయన నమ్ముతున్నారు.  
 
అయితే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా ఏం చేయాలో జగన్ దగ్గర ఇప్పటికే అద్భుతమైన ప్రణాళిక ఉందని తెలుస్తోంది. గత ఐదేళ్లలో ప్రధానంగా ఏ విషయాలలో విమర్శలు వ్యక్తమయ్యాయో ఆ విషయాలపై ఫోకస్ పెట్టేలా జగన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. సంక్షేమం విషయంలో ఇప్పటికే ఆచితూచి నిర్ణయాలు తీసుకున్న జగన్ మళ్లీ సీఎం అయితే అభివృద్ధిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
 
విశాఖ రాజధానిగా జగన్ ముందడుగులు వేయనున్నారని పెద్దఎత్తున సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు పరిశ్రమల ఏర్పాటు జరిగేలా సీఎం ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల సమస్య ఉన్న అన్ని ప్రాంతాలలో కొత్త రోడ్లకు అనుమతులు ఇచ్చేలా జగన్ ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారని సమాచారం అందుతోంది. మద్యం విషయంలో ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు పేద ప్రజలకు స్వయం ఉపాధి లభించేలా సరికొత్త పథకాల అమలు దిశగా జగన్ అడుగులు వేయనున్నారని భోగట్టా.
 
ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సొంత పార్టీ సర్వేలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ నమ్ముతున్నారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అభివృద్ధికి పెద్ద పీట వేసి విమర్శించిన వాళ్ల నోర్లు మూయించేలా పాలన సాగించాలని జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మహిళల్లో 54 నుంచి 56 శాతం ఓట్లు వైసీపీకి పడే ఛాన్స్ ఉందని సర్వేలలో వ్యక్తమవుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో జగన్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: