బీజేపీ: షాకిచ్చిన ఖుష్బూ..అదే కారణమా..?

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతున్నాయో చెప్పడం అసాధ్యం.. ముఖ్యంగా చాలామంది నేతలు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అవుతూ ఆ పార్టీలకు షాక్ ఇస్తున్నారు.. ఈ క్రమంలోనే బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు జేపీ నడ్డాకు , సినీ నటి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు లేఖ రాస్తూ బరువెక్కిన హృదయంతో ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నానంటూ స్పష్టం చేసింది.. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికలలో ఖుష్బూ సీటును ఆశించిన విషయం తెలిసిందే.. అయితే ఆమెకు బిజెపి ఇప్పుడు సీట్ ఇవ్వలేదు . దీంతో కథ కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారాలకు కూడా దూరంగా ఉంటూ రావడం చర్చకు దారి తీసింది..
అయితే ఇప్పుడు వాటికి ముగింపు పలికే విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన కుష్బూ.. కొన్నిచోట్ల మమా అనిపించి.. ఇష్టం లేనట్టుగానే ప్రచారాలలో పాల్గొనింది. ఇక శనివారం దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళ సై సౌందర్య రాజన్ కు మద్దతుగా ఖుష్బూ ప్రచారం కూడా చేశారు. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో.. ఏమో కానీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు లేక రాసింది ఖుష్బూ..
అయితే ఇందుకు గల కారణం ఏమిటంటే.. కొద్ది రోజుల్లో రానున్న లోకసభ ఎన్నికలలో తనకు సీటు ఇవ్వకుండా బిజెపి దూరం పెట్టిందని.. ఆపై పార్టీలో చేరిన సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కి  లోక్సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సీటు కేటాయించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఈసారి ఆమెకు సీటు దక్కకపోవడంతో కుమిలిపోయారని... అందుకే ఇక ప్రచారాలలో పాల్గొనలేకపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా ఎన్నికల్లో బిజెపి పెద్దలు అన్నామలై , ఎల్ మురుగన్ , తమిళసై సౌందర్య రాజన్, రాధికా శరత్ కుమార్ వంటి వారికి మాత్రమే సీటు కేటాయించింది. ఆ కోణంలో చూస్తే ఖుష్బూకి కూడా సీటు కేటాయించాల్సి ఉంది.. కానీ ఆమెకు మొండి చేయి చూపించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో చెన్నై జిల్లాలోని మూడు లోక్సభ స్థానాలలో ఏదో ఒక స్థానాన్ని ఆమెకు కేటాయిస్తారని అందరూ భావించారు .. కానీ ఇప్పుడు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. మరొకవైపు ఈమెకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని బిజెపి నాయకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతినెలా ఇస్తున్న రూ.1000 ని భిక్షంగా వ్యాఖ్యానించడం రాష్ట్రంలో వివాదం అయింది.. ఈ వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయేమో అందుకే ఆమెకు వ్యతిరేకత వచ్చిందని కొంతమంది చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: