బీజేపీ : మజ్లీస్ ను దెబ్బ కొడుతుందనుకుంటే.. మోడీకే షాకిచ్చేలా ఉందే?

praveen
తెలంగాణలో ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే . ప్రత్యర్థి పార్టీల కంచుకోటలను సైతం బద్దలు కొట్టి విజయ డంకా మోగించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈసారి తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి.. ఇక గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. ఈ క్రమంలోనే మజ్లీస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న బిజెపి ఇక ఈసారి ఒక బలమైన అభ్యర్థిని బరిలో నిలిపింది.

 హిందూ వాది అయిన మాధవి లతను ఇక్కడి నుంచి బరిలోకి దింపింది బిజెపి అధిష్టానం. ఈ క్రమంలోనే మజిలీస్ పార్టీని దెబ్బ కొట్టి ఇక హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే హిందుత్వ భావాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ.. మోడీ ప్రభుత్వం చేసిన పనులను  చెప్తూ ఓటర్లు అందరినీ కూడా చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆమె ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కానీ మాధవి లత తీరు ఎక్కడో తేడా కొడుతుందని అనుకుంటున్నారట జనాలు.  ఇలా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లత మాత్రం తరచూ సోషల్ మీడియా ట్రోల్స్ కి గురి కావడం పార్టీలో కలకలం రేపుతోంది.

 అయితే మాధవిలత కొన్ని ఇంటర్వ్యూలలో చేస్తున్న వ్యాఖ్యలు ఆమె గెలుపుకు అడ్డంకుగా మారడమే కాదు ఏకంగా బిజెపి పార్టీని సైతం ఇరుకునపెట్టేలా మారాయి అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉంది. ఏకంగా ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒకటి మాట్లాడి నేటిజన్స్ చేతికి చిక్కి రోల్స్ కి గురవుతుంది. ఒక రకంగా ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చినంత పని చేస్తున్నారని ఒక టాకు వినిపిస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను స్వాతంత్రానికి పూర్వం పుట్టాల్సిన దానిని.. అప్పుడు తన పోరాటపాటిన చూసి భగత్ సింగ్ మాదిరిగా నన్ను ఉరి తీసే వారిని అంటూ వ్యాఖ్యానించింది. భగత్ సింగ్ లాంటి స్వతంత్ర సమరయోధుతో మీకు పోలిక ఏంటి అంటు నేటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఇక బిజెపి ఎమ్మెల్యేలు, కీలక నేతల నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ అందకపోవడం ఇలా మజిలీస్ ను దెబ్బ కొడుతుందనుకుంటే చివరికి ఆమెకు టికెట్ ఇచ్చిన మోడీకే ఆమె షాక్ ఇచ్చేలా ఉంది అని రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: