విజ‌య‌వాడ తూర్పులో ' దేవినేని ' జోరు.. ' గ‌ద్దె ' బోరు బోరు...!

RAMAKRISHNA S.S.
ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఆస‌క్తి క‌ర పోరుకు రెడీ అయ్యాయి. విజ‌య‌వాడ తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు.. గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా.. ఇప్పుడు హీటెక్కా యి. వీటిలో తూర్పులో గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా.. యువ నాయ‌కుడు, దేవినేని వార‌సుడు అవినాష్ రంగంలోకి దిగారు. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో సెంట్ర‌ల్‌లోను, ప‌శ్చిమ లోనూ పెద్ద‌గా ఊపు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, తూర్పులో మాత్రం గ‌త రెండేళ్లుగా రాజ‌కీయం వేడెక్కుతూనే ఉంది.
ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు.. అభ్య‌ర్తులు ఖ‌రారు కావ‌డం.. ఇరువురు నాయ‌కులు కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డంతో మ‌రింత వేడిగా మారింది. ముఖ్యంగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్ కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం కొట్టిన పిండి. దేవినేని నెహ్రూ హ‌యాం నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గం ఈ కుటుంబానికి అండ‌గా ఉంది. కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా ఇక్క‌డ అంద‌రూ దేవినేని వ‌ర్గంగానే ఉండేవారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో తాను పోటీ చేయాల‌న్న‌ది అవినాష్ సంక‌ల్పం.
రెండు ఎన్నిక‌ల్లో ఈ అవ‌కాశం కోసం ఎదురు చూసిన అవినాష్‌.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో దానిని వైసీపీ నుంచి ద‌క్కించుకున్నారు. గ‌త మూడేళ్లుగా ఆయ‌న ఇక్క‌డ ప‌నిచేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నా రు. మూడేళ్ల నుంచి ప్ర‌తి రోజు అవినాష్ జ‌నాల్లోనే ఉంటూ వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నారు. దీనికి తోడు అటు సీఎం జ‌గ‌న్ స‌హాయ స‌హ‌కారాలు పూర్తిగా ల‌భించ‌డంతో అవినాష్ ఎమ్మెల్యే కాకుండానే చాలా ప‌నులు చేసేశారు. త‌న‌పేరును ప్ర‌క‌టించ‌క‌ముందే.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. తాను గెల‌వ‌క‌పోయినా.. ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. సీఎం జ‌గ‌న్‌తో ఉన్న స‌త్సంబంధాలు అవినాష్‌ను బెజవాడ రాజ‌కీయాల్లోనే స్పెష‌ల్ లీడ‌ర్‌గా నిల‌బెట్టాయి.
ఇక‌, టీడీపీ నుంచి బ‌రిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సీనియ‌ర్ నేత అయినా.. గ‌త రెండు ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు రెండుసార్లు గెలిపించినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేక‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. ఇద్ద‌రు నేత‌లు క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారే కావ‌డంతో ఇరు ప‌క్షాల‌కు ఫాలోయింగ్ అలానే ఉంది. గద్దె టీడీపీ పేరు చెప్పుకుని క‌మ్మ‌ల‌ను త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా ఈ సారి ఆ ప‌ప్పులు ఉడ‌క‌డం లేదు. అవినాష్ కూడా క‌మ్మ నేతే కావ‌డంతో ఆ వ‌ర్గంలో మెజార్టీ చీలిక క‌న‌ప‌డుతోంది. ఈ వ‌ర్గంలో అవినాష్ జోరు చూపిస్తుంటే.. గ‌ద్దేను ఎప్ప‌టి నుంచో చూస్తోన్న యువ‌త బోర్ కొట్టేశాడ‌నే అంటున్నారు. ఈ సారి అవినాష్‌కు ఛాన్స్ ఇవ్వాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు.
ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నా ప్ర‌కారం.. అవినాష్ వైపు మొగ్గు క‌నిపిస్తున్నా.. ఆయ‌న మ‌రింత శ్ర‌మించ‌క త‌ప్ప ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎవ‌రు గెలిచినా.. స్వ‌ల్ప మెజారిటీతోనేని చెబుతున్నారు. ఇంకా, ఎన్ని కల‌కు నెల రోజుల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు మ‌రింత తీవ్రంగా ముందుకు సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, వైసీపీలోనే ఉన్న య‌ల‌మంచిలి ర‌వి వంటివారిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు అవినాష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఆయ‌నకు మ‌రింత సానుకూల‌త ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: