ప్ర‌కాశం: జ‌గ‌న్‌కు డైరెక్ట్ షాక్ ఇచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే ' ఏలూరి సాంబ‌శివ‌రావు ..!

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌రుచూరులో ఎన్నిక‌లు ఏక‌ప‌క్ష‌మేనా?  ఇక్క‌డ టీడీపీకి అపొజిష‌న్ నుంచి పోటీ ఉండ‌దా ?  పేరుకే వైసీపీ ఇక్క‌డ పోటీలో ఉందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రుచూరు ప్ర‌జ‌లు. వాస్త‌వానికి వైనాట్ 175 నినాదంతో ఈ ఎన్నిక‌ల్లోకి వ‌చ్చిన వైసీపీ.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాట ఎలా ఉన్నా.. ప‌రుచూరు నియోజ‌క‌వర్గంలో మాత్రం చేతులు ఎత్తేసింది. దీనికి కార‌ణం.. స‌రైన అభ్య‌ర్థి వైసీపీకి లేక‌పోవ‌డం.. పైగా ప్ర‌జ‌ల నాయ‌కుడిగా ఏలూరి సాంబ‌శివ‌రావు దూసుకుపోవ‌డం.
ఈ రెండు కార‌ణాలే కాదు.. ప‌రుచూరు ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తే.. అనేక విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సారికి ఏలూరే.. అనివారు ముక్త‌కంఠంతో నినదిస్తున్నారు. అంతేకాదు.. దీనికి అనేక కార‌ణాలు కూడా చెబుతున్నారు. అనేక ఆన్‌లైన్ స‌ర్వేలు కూడా .. ఇక్క‌డ ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల అభిప్రాయం సేక‌రించారు. వీటిలోనూ ఎక్క‌డా వైసీపీ మాట వినిపిచ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అస‌లు ఒక్క స‌ర్వే కూడా ఇక్క‌డ ఏలూరి ఓడిపోతాడ‌ని చెప్ప‌డం లేదు. పైగా ఏలూరి మెజార్టీ 20 వేలా.. 25 వేలా.. 30 వేలా అన్న లెక్క‌లే న‌డుస్తున్నాయి.
వాస్త‌వానికి.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ ప‌రుచూరు విష‌యానికి వ‌స్తే మాత్రం చేతులు ఎత్తేసింది. ఇక‌, జ‌నం నాడిని గ‌మ‌నిస్తే.. ప్ర‌ధానంగా త‌మ‌కు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాల‌ని కోరుతున్నా రు. వైసీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుతం పోటీలో ఉన్న ఎడం బాలాజీ.. జెండాలు మార్చే ర‌కం కావ‌డం.. ఓడిపోయిన త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావ‌డం.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గం బోర్డ‌ర్‌లు ఎక్క‌డ ?  ఏయే ఊళ్లు ఉన్నాయో కూడా తెలియ‌క‌పోవడం వంటివి భారీ మైన‌స్‌లు. ఆ మాట‌కు వ‌స్తే బాలాజీ ప‌రుచూరు ఓడు కాదు ఎక్క‌డో చీరాల ప్రాంతానికి చెందిన వ్య‌క్తి.
ఇక‌, ఏలూరి విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ ఆయ‌న పంథానే డిఫ‌రెంట్‌గా ఉంది. ప్ర‌జ‌ల‌తో ఆయ‌న మేమేకం అవుతున్నారు. ఎన్నిక‌లు అన్న కాన్సెఫ్ట్ ప‌క్క‌న పెట్టి గ‌త ఐదేళ్ల నుంచి కూడా జ‌నాల్లోనే ఉన్నారు. నేనున్నానంటూ.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా రైతుల‌కు అయితే.. ఏలూరి త‌మ చేతిలో మ‌నిషిగా మారిపోయారు. ప్ర‌భుత్వం కూడా చేయ నంతగా.. అందుబాటులో ఉండ‌నంత‌గా ఏలూరి ఇక్క‌డ ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయారు.
క‌రోనా టైంలో ఆ త‌ర్వాత రైతుల‌కు వ్య‌క్తిగ‌తంగా ఎంతో సేవ‌చేశారు. రైతుల‌కు కంపెనీల‌తో మాట్లాడి స‌బ్సిడీ రేట్ల‌కు ట్రాక్ట‌ర్లు ఇప్పించ‌డం.. ఎన్నారై నిధులు సేక‌రించి క‌రోనా టైంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు అంద‌రికి తైవాన్ స్ప్రేయ‌ర్లు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో రైతు వ‌ర్గాలు ప్ర‌ధానంగా ఏలూరికి జై కొడుతున్నాయి. వివాదాల‌కు దూరంగా..యువ‌త‌కు చేరువ‌గా ఉండే ఏలూరి.. ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీని కాపాడుకోవ‌డం.. అంద‌రికీ వ‌ర్గ, రాజ‌కీయ విభేదాలు లేకుండా ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. ఆయ‌న చేస్తున్న సాయం వంటివి వంద శాతం మార్కులు వేస్తున్నాయి. దీంతో ఈసారికి ప‌రుచూరులో ఏలూరే అనే మాట ఏ గ‌డ‌ప‌ను ప‌ల‌క‌రించినా వినిపిస్తున్న ప్ర‌ధాన మాట‌. అందుకే ఎన్నిక‌లు.. కౌంటింగ్ సంగ‌తేమో గాని.. నామినేష‌న్లు కూడా స్టార్ట్ అవ్వ‌కుండానే జ‌గ‌న్ పార్టీకి ఏలూరి షాక్ ఇచ్చేసిన‌ట్టే అనుకునేంత టాక్ ఇక్క‌డ వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: