30 ఏళ్ల రాజ‌కీయ వైరం స్నేహ‌మైన వేళ‌... గుర‌జాల‌లో ' య‌ర‌ప‌తినేని ' ర‌ప్ఫాడించేస్తున్నాడే..!

RAMAKRISHNA S.S.
ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు ఇముడుతాయా?  నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న ఇద్ద‌రు పెద్ద‌ నాయ‌కులు ఇప్పుడు స‌ర్దుకు పోవ‌డం సాధ్య‌మేనా?  అంటే.. సాధ్య‌మేన‌ని నిరూపిస్తున్న గుర‌జాల సీనియ‌ర్ నాయ‌కుడు, టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, ఇదే నియోజ‌క‌వ‌ర్గం నేత‌, ఇటీవ‌ల వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న బీసీ నాయ‌కుడు జంగా కృష్ణ‌మూర్తి. వీరిద్ద‌రూ ఇప్పుడు చేతులు క‌లిపారు. ఒక్క చేతులే కాదు.. మ‌న‌సులు కూడా క‌లిపారు.
నిజానికి జంగా కృష్ణ‌మూర్తి వైసీపీలో ఉన్న‌ప్పుడు ఈ టికెట్ ను ఆశించారు. అయితే.. ఆ పార్టీ టికెట్ నిరాక రించ‌డంతో ఆయ‌న టీడీపీ కండువాక‌ప్పుకొన్నారు. జ‌గ‌న్ జంగాను ఫుల్లుగా వాడుకుని త‌న వ‌ర్గానికే చెందిన కాసు మ‌హేష్‌రెడ్డికి పెద్ద‌పీఠ వేశారు. తాను గుర‌జాల‌లో పోటీ చేస్తాన‌ని చెప్పినా కూడా జ‌గ‌న్ జంగాను లైట్ తీస్కోన్నారు. దీంతో జంగాను తాను 30 ఏళ్లుగా పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ అక్కున చేర్చుకుంది. ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చినా కూడా ఆయ‌న‌కు చిర‌కాలంగా రాజ‌కీయంగా శ‌త్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనికే టీడీపీ టికెట్ ఇచ్చింది.
దీంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త ఎలా ఉంటుందా ? అన్న స‌స్పెన్స్ ఉంది.  ఇక్క‌డే చంద్ర‌బాబు మంత్రాంగం నెరిపారు. దీంతో ఇరువురు నేత‌ల‌తోనూ కూర్చుని చంద్ర‌బాబు మాట్లాడారు. దీంతో జంగా-య‌ర‌ప‌తినేని పాత రాజ‌కీయ వైష‌మ్యాల‌ను ప‌క్క‌న పెట్టి .. చేతులు క‌లిపారు. ఇప్పుడు య‌ర‌ప‌తినేని గెలుపు కేవ‌లం ఆయ‌నదే కాదు. ఇప్పుడు జంగాది కూడా. వైసీపీ త‌న‌కుటికెట్ ఇవ్వ‌కుండా అవ‌మానించింద‌నే బాధ‌తో పాటు.. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డి త‌న‌ను , త‌న‌వారిని అణిచి వేశార‌న్న ఆవేద‌న కూడా జంగాలో ఉంది. దీంతో కాసును ఓడించాల‌నే ప‌ట్టుద‌ల, క‌సి వంటివి జంగాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.
ఈ నేప‌థ్యంలో య‌ర‌ప‌తినేని విజ‌యం కోసం.. జంగా త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నారు. మ‌రోవైపు... య‌ర‌ప‌తినేనికి ఇప్ప‌టికే ఉన్న ఇమేజ్‌.. కాసు గ‌ర్భ‌గుడిలో కూర్చున్న‌ట్టు.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం, భారీ ఎత్తున సెక్యూరిటీని పెట్టుకుని ఎవ‌రినీ రాకుండా నియంత్రించ‌డం వంటివి కూడా.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌ను దూరంగా పెట్టాయి. దీంతో ర‌గిలిపోతున్న ప్ర‌జ‌లు కూడా.. కాసు ఓట‌మిని రాసిపెట్టుకున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ క‌లిసి రావ‌డంతో గుర‌జాల‌లో ఇప్పుడు య‌ర‌ప‌తినేని ర‌ప్ఫాడించేస్తున్నారు.
దీనికి తోడు య‌ర‌ప‌తినేనికి ద‌న్నుగా మారిన జంగా.. ఓట్లు చీల‌కుండా త‌నవంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బీసీల ఓట్లు గుండుగుత్త‌గా ఆయ‌న‌కే ప‌డేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఫ‌లితంగా ఈ సారి య‌ర‌ప‌తినేని గెలుపు మాత్ర‌మే కాదు భారీ మెజార్టీతో విక్ట‌రీ కొట్టేలా గుర‌జాల రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: