ఏపీ: రెడ్ల దౌర్జన్యాన్ని అడ్డుకుంటా - సీఎం రమేష్..

Divya
అనకాపల్లిలో సీఎం రమేష్ నాన్ లోకల్ అయినప్పటికీ తనదైన వ్యూహంతో నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉన్నారు.. ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరుడి దుకాణం పైన జీఎస్టీ అధికారులు సైతం దాడులు చేయడంతో వారిని అడ్డుకునే విషయంలో హైలైట్ గా మారారు.. అప్పుడే ఆయన పైన పలు రకాల కేసులు కూడా నమోదు అయినట్లుగా తెలుస్తోంది.. ఈ విషయమే ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది.. దీంతో సీ . ఎం.రమేష్.. రెడ్ల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకే తాము ఉంటామంటూ.. ప్రజలలో భరోసా ఇస్తామంటూ మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన పలు విషయాలను ప్రకటించారు..

రెడ్ల దౌర్జన్యాన్ని ఎర్రమనాయుడు, వెంగళరావు వంటి వారు అడ్డుకున్నారని.. అలాగే తాను కూడా అడ్డుకుంటాననే శపదాన్ని కూడా చేశారు సీ. ఎం.రమేష్.. వ్యూహాత్మకంగానే సీఎం రమేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అనకాపల్లి పరిధిలో వేమల వర్గం వ్యాపారస్తులుగా ఉన్నారు.. వారిపైన రెడ్ల దౌర్జన్యం పెరిగిపోయిందనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. సీఎం రమేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.. అయితే తమ స్థానికుడు కాదంటున్న వారికి ఆయన గట్టిగానే సమాధానాన్ని తెలియజేశారు..
పార్లమెంట్ ఎన్నికలలో స్థానికత కంటే సమర్థత కే ఎక్కువగా ఓటు ఉంటుందని స్పష్టం చేశారు.. పీవీ నరసింహారావు ఒడిస్సా,  నంద్యాలలో పోటీ చేశారని నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు ఎక్కడెక్కడ పోటీ చేసి మంచి విజయాన్ని అందించారో గుర్తు చేశారు.. పులివెందులలో తాగునీటికి.. తన ఎంపీ లాండ్స్ నిధులు ఎక్కువగా ఇచ్చానని.. తన పైన జరుగుతున్న ఇలాంటి ఆర్థిక అక్రమాల ఆరోపణల పైన కూడా స్పందించారు.. అలాగే బ్యాంకు రుణాల ఎగవేత , ఫోర్జరీ కేసులు కూడా ఉన్నట్లు తన మీద ఎవరైనా నిరూపిస్తే ఈ పోటీ నుంచి తప్పుకుంటానంటూ కూడా సవాలు విసరడం జరిగింది.. చోడవరంలో ఒక టైల్స్ యజమానిని ధర్మశ్రీ వేధిస్తుంటే తాను అడ్డుకున్నానని ..అందులో తప్పేమీ లేదంటూ కూడా సీఎం రమేష్ వెల్లడించారు.. డైరెక్ట్ గా ఆ బాధితులని జలగం ఎర్రన వద్దకు తీసుకువెళ్లి వారి స్థాయిలో పోరాడుతానంటూ అక్కడ ఉన్న వారికి భరోసా ఇచ్చానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: