ఏపీ : ఈసీ.. స్పెషల్ గా టార్గెట్ వారే..!

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికలు ప్రశాంతంగా , స్వేచ్ఛగా , శాంతియుతంగా జరిపించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు , ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు అంతా చాలా ఓర్పుతో , సమన్వయంతో అన్ని సమస్యలపై చాలా త్వరగా పరిష్కారాలను చేయాలి అని జనాలకు వాటి ద్వారా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని మీనా సూచించారు.

అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు , పోలీస్ సూపరింటెండెట్లు , పోలీస్ కమిషనర్ లతో సీఈవో మీనా నిన్న మీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి తీసుకుంటున్న చర్యలు అలాగే వాటికి సంబంధించిన పనులు ఎక్కడి వరకు వచ్చాయి అనే విషయాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్నికల కోడ్ ను అమలుపరిచే విశాయలను తెలుసుకున్నారు.

రాబోయే ఎన్నికలలో ఎలాంటి హింసకు చోటు ఉండకూడదు అని రీపోలింగ్ జరగకూడదు అని మీనా సూచించారు. గంజాయి , లిక్కర్ , డబ్బు ఇలాంటివి అక్రమంగా జిల్లాల్లోకి రాకూడదు అని ఆయన చెప్పారు. ఇలా అక్రమ గంజాయి , లిక్కర్ , డబ్బు రాష్ట్రాల్లోకి రాకుండా చెక్ పోస్ట్ ల దగ్గర చాలా బలంగా పని చేయాలి అని ఇప్పుడు ఉన్న దాని కంటే కూడా మరింత గట్టిగా చెక్ పోస్ట్ సిబ్బంది పని చేయాలని ఆయన సూచించారు.

అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు వ్యక్తుల దగ్గర 50 వేలకు మించి డబ్బు గాని ఉన్నట్లు అయితే వెంటనే దానిని జప్తు చేయాలి అని ... వ్యాపారులు , సామాన్య ప్రజలకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని కూడా మీనా తాజా మీడియా కాన్ఫరెన్స్ లో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: