బిఆర్ఎస్ : మనసు మార్చుకున్న కేసీఆర్.. ఆ రోజే కీలక ప్రకటన?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని పార్టీగా అవతరించింది బిఆర్ఎస్. ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి అధికారం చేపట్టింది. అయితే ఒక్కసారి మాత్రమే కాదు రెండోసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధించి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది బిఆర్ఎస్ పార్టీ. అయితే ఇక ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న క్రేజ్ దృశ్య మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పార్టీ నేతలు బలంగా నమ్మారు. కానీ ఓటర్లు మాత్రం మరొకటి అనుకున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు.

 దీంతో తెలంగాణలో హ్యాట్రిక్ కొడతాం అనుకున్నా బిఆర్ఎస్ పార్టీకి చివరికి భంగపాటు తప్పులేదు. ఇక ఇప్పుడు ఆ పార్టీలోని కీలక నేతలు ఎంతోమంది కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో.. కనీసం ప్రతిపక్ష హోదాలోనైనా బిఆర్ఎస్ పోరాడగలరా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే పార్టీ ఇలాంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటి అని విషయంపై గులాబీ దళపతి కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికల ముందు టిఆర్ఎస్ గా ఉన్న పేరును బిఆర్ఎస్ గా మార్చడం కూడా కొంత మైనస్ గా మారింది అనే విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ విషయంపై బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది తెలుస్తుంది. బిఆర్ఎస్ ను మళ్లీ టిఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు సమాచారం. ఈనెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉండగా.. అదేరోజు పార్టీ పేరు మార్పుకు సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి  ఇక టిఆర్ఎస్ పేరుతో లోక్సభ ఎన్నికల్లో బలులోకి దిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ నేతలు అనుకుంటున్నారట. అయితే నిజంగానే పార్టీ పేరు మార్చుతార కేవలం ఇవన్నీ ప్రచారాలు మాత్రమేనా అనే విషయంపై మాత్రం మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. అయితే అటు కార్యకర్తలు కూడా పార్టీ పేరును బిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ గా మార్చాలని పట్టుబడుతూ ఉండడం గమనార్హం. అయితే ఇలా పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చినప్పుడే కలిసి రాదు ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశం ఉందని కార్యకర్తలతో పాటు ఎంతో మంది విశ్లేషకులు చెప్పినా పట్టించుకోని కేసీఆర్ మళ్ళీ ఇక ఇప్పుడు కార్యకర్తలు చెప్పినట్లుగానే పార్టీ పేరును మార్చబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: