రాయలసీమ (రాయచోట): కూటమి vs వైసీపీ.. గెలుపు ఎవరిది..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కడప జిల్లాలో వైయస్సార్ పార్టీకి కంచుకోట లాంటి నియోజవర్గం ఏంటి అని అడిగితే.. మొదట పులివెందుల అని చెబుతారు.. ఆ తర్వాత అంతే స్థాయిలో పేరు సంపాదించిన నియోజవర్గం రాయచోటి.. అక్కడ టిడిపి, వైసిపి పార్టీ మధ్య హోరా హోరీగా ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయట.. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సిపి తరఫున గండికోట శ్రీకాంత్ రెడ్డి కి టికెట్ లభించగా.. రాయచోటిలో ఎక్కడికి వెళ్ళినా సరే గండికోట శ్రీకాంత్ రెడ్డి కంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులే ఇప్పటికి అక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించడానికి కారణం అవుతున్నాయి. గండికోట శ్రీకాంత్ రెడ్డి గెలవడానికి కూడా ముఖ్య కారణాలు ఇవే..
అంతేకాదు వైయస్సార్ ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న అభ్యర్థులను కూడా గెలిపించడానికి అక్కడి ప్రజలు ఆసక్తి చూస్తున్నారు.. వైయస్సార్ మరణం తర్వాత 2012 లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థులలో గండికోట శ్రీకాంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. పైగా శ్రీకాంత్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి క్లాస్మేట్ కావడం వల్ల గతంలో ఈయన సపోర్టు కూడా చాలా లభించింది.
టిడిపి విషయానికొస్తే.. తారకరత్న కి దగ్గర బంధువైన ద్వారకానాథ్ రెడ్డి.. ఈయన ఇంటిపేరు కూడా గండికోట.. ఈయన గతంలో వైఎస్ఆర్సిపిలో ఉండేవారు కానీ తర్వాత కాలంలో టిడిపిలోకి చేరినా టికెట్టు ఇవ్వలేదు. ఇప్పటికే ఎంతో మంది నాయకులను టిడిపి సర్వే చేయగా.. చివరికి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. వైసిపి నుంచి ఈయన కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈయన సొంత మండలం చిన్నమొండెం లో మాత్రమే ఈయనకు ఎక్కువ సపోర్టు లభిస్తోంది. మిగతా ఏ ప్రాంతంలోకి వెళ్లినా కూడా అక్కడ సీనియర్ నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయట.

దీంతో  రాయిచోటి లో టిడిపిలో అంతర్గత విభేదాలు కూడా మొదలయ్యాయి. దీంతో అటు టిడిపి పార్టీ లో చాలా టఫ్ పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పార్టీకి అడ్డుకట్ట వేయాలని టిడిపి అనుకున్నప్పటికీ సరైన నేతకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఇది సాధ్యం కాదనే విధంగా వినిపిస్తోంది. అక్కడ టిడిపి గెలవాలి అంటే.. ముస్తఫ హుస్సేన్, రమేష్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి  ఇలా అందరూ కలిసికట్టుగా వెళ్తేనే తప్ప అక్కడ వైసిపి పార్టీని అడ్డుకొనే అవకాశాలు కనిపించడం లేదట. టిడిపిలో రాజుకున్న ఈ విభేదాల వల్ల మరొకసారి గండికోట శ్రీకాంత్ రెడ్డి అవకాశం ఉన్నదట. అయితే ఎంతటి మెజారిటీ అనే విషయం మాత్రం చెప్పడం కష్టంగా మారుతోందట. చివరిగా టిడిపి పార్టీ 2004లో మాత్రమే అక్కడ గెలిచిందట. అప్పటినుంచి ఇప్పటివరకు గెలవలేదు. మొత్తానికి అయితే రాయచోటి మళ్లీ వైసీపీ సొంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: