పవన్ కళ్యాణ్: ఆ తప్పులే రాజకీయంగా ముంచేశాయా..?

Divya
సినిమా రంగంలో ఎవరైనా సక్సెస్ సాధించడం అంత సులభం ఏమీ కాదు..కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా ఈ రంగంలో సక్సెస్ సాధించలేక ఫెయిల్యూర్ గా మిగిలిన వారు ఉన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు అన్నీ కలిసి వచ్చి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. సినిమాలలో సక్సెస్ ని రాబట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు.. అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా సినీ అభిమానులు ఆయన వెంటే ఉన్నారు.. ముఖ్యంగా అభిమానులు కూడా తమ హీరో ఎక్కడ సక్సెస్ అయితే  ఆనందం అక్కడే అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు.. సినిమాలను కొన్నాళ్లు పక్కన పెట్టి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపిస్తున్నాను అని కూడా ప్రకటించారు.. అయితే అదే ఏడాది ఎన్నికలలో పోటీ చేయకుండా టిడిపి నేత చంద్రబాబు నాయుడు కి సపోర్ట్ చేస్తూ 2014లో టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించారు.. తన పార్టీని స్థాపించి పార్టీ తరపున పోటీ చేయకుండా టిడిపికి సపోర్టు చేస్తూ తనను ప్రజలను మోసం చేయడంతో అభిమానుల సైతం సహించలేకపోయారు..పవన్ కళ్యాణ్ ను నమ్మి టిడిపికి ఓటు వేసిన ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.. దీంతో పవన్ కళ్యాణ్ కు రాజకీయ లక్షణాలు లేవనే కామెంట్స్ కూడా  వినిపించాయి. పైగా పవన్ , నాదెండ్ల మనోహర్ తప్ప మరో కీలక నేత జనసేన పార్టీలో లేరని..  అలాంటి పార్టీని ఎలా గుర్తించాలంటూ కూడా ప్రశ్నించడమే కాదు తనను నమ్మిన ప్రజలకు ఏం చేశారని కూడా విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ఏదైనా మాట చెబితే పది రోజుల తర్వాత ఆ మాట పైన అసలు నిలబడరని.. ఈ తరహాలోనే రాజకీయాల వల్ల జీవన నష్టం ఎదురవుతుందని ఇప్పటికే చాలామంది హెచ్చరించారు కూడా.. దీంతో 2019లో తాను సింగల్ గా పోటీ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు మీద చాలా విమర్శలు  చేశారు.అప్పుడు జనసేన పార్టీకి సీట్లు రాలేదు.. పైగా  పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయారు. సరైన నిర్ణయాన్ని తీసుకోలేక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆయనను తప్పుదోవ పట్టించాయి అలా రెండుసార్లు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు.
ఇక ఇప్పుడు 2024 ఎన్నికలలో అయినా  సింగల్ గా పోటీ చేస్తారని అభిమానులు అనుకున్నప్పటికీ.. మనీ లాండరింగ్ కేసులో చంద్రబాబును జైల్లో వేయడంతో జైలుకెళ్ళి మరీ పార్టీ పొత్తు ఉంటుందంటూ వెల్లడించారు.. దీంతో చాలామంది నేతలు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అసహనాన్ని తెలియజేశారు.. ఈ తప్పే పవన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది.. ఒకరకంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గడానికి కారణం ఆయన తీసుకునే తప్పుడు నిర్ణయాలతో పాటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. ఈ విమర్శల సంగతి పక్కన పెడితే.. ఒకవేళ రాజకీయంపై అనుభవం ఉండి ఉంటే  పొత్తులో భాగంగా కనీసం సీట్ల విషయంలో అయినా ఎక్కువ మొత్తం తీసుకునేవారు కానీ అలా చేయకుండా కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం కూడా లేదని తేలిపోయింది..

వాస్తవానికిజనసేన పార్టీ ఆవిర్భావం నుంచే తాను ప్రజల కోసమే ఈ పార్టీని స్థాపించానని చెప్పినప్పటికీ.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా.. సభలలో అధికార పార్టీని దించాలని ఉద్దేశంతోనే..  నానా విమర్శలు చేస్తూ ఉంటారు.. ప్రజలు తనని ఎంచుకుంటే ఏం చేస్తాననే విషయం పైన ఎప్పుడు మాట్లాడలేదు.. ఆవేశంతో కాదు ఆలోచనలతో ముందడుగు వేస్తే పవన్ రాజకీయంగా సక్సెస్ అవుతారు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: