ఏపీలో వార్ వన్ సైడ్... ప్రజలంతా జగన్ సైడ్ ..?

RAMAKRISHNA S.S.
ఏపీలో రాజ‌కీయాలు మారుతున్నాయి. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించేందుకు కూటమి ఐతే ఏర్పడింది కానీ అది బయటకు చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప క్షేత్ర స్థాయిలో వాళ్లకు ఉపయోగపడకపోగా చేతబడి మంత్రాలు సరిగా పారక..అది ఎదురుతిరిగినట్లు అవుతోంద‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా న‌డుస్తోంది. కూటమి గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతోంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది పొసగడం లేదు. అస‌లు చంద్ర‌బాబు ఇష్టం వ‌చ్చిన‌ట్టు సీట్లు మార్చేస్తున్నారు.

అటు బీజేపీ, జ‌న‌సేన‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ముందు టీడీపీ తీసుకున్న అప‌ర్తి సీటును ఆ త‌ర్వాత బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు తిరిగి ఆ సీటు టీడీపీకి అంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ‌, ప్ర‌స్తుత ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు కొట్టుకున్న ఉండి సీటును ముందు మంతెన రామారాజుకు ఇచ్చారు. ఇప్పుడు నిన్న టీడీపీ కండువా క‌ప్పుకున్న న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణం రాజుకు కేటాయిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే నివురు గ‌ప్పిన నిప్పు కాస్తా ఇప్పుడు మూడు గ్రూపుల గోల గా మారిపోయింది.

ఇలా రోజుకో సర్దుబాటు చేస్తుంటే ఈ కొంప కొల్లేరు అవుతుండ‌డంతో పాటు ఇంకో జిల్లాలో కొంప అంటుకుంటోంది. ఇన్నాళ్లూ ఏదోలా సర్దుబాటు చేస్తూ వచ్చినా ఇప్పుడు అదీ కుదరడం లేదు.. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఎదురుగానే క్యాడర్ ఆందోళనకు దిగుతున్నారు. సీట్ల సర్దుబాటు, పొత్తుల కారణంగా టిక్కెట్లు కోల్పోయినవాళ్లంతా ఇప్పుడు పార్టీకి పెనుగండంగా మారారు.

దీంతో పార్టీ పొత్తుల కారణంగా బలోపేతం అయ్యిందా.. రెబెల్స్ దెబ్బకు కుదేలవుతోందా అన్నది అర్థం కాక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. ఎలా లెక్కేసినా కూటమి గ్రాఫ్ రోజురోజుకూ కిందికి జారిపోతుండడంతో ఏమి చేయాలో తెలీడం లేదు.. అటు కూట‌మి ఫ్యా న్స్ కు కూడా రోజు రోజుకు టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు సీఎం వైయస్ జగన్ గ్రాఫ్ కొద్దిరోజులుగా బాగా పెరుగుతోంది. జగన్ అయితేనే చేస్తాడు అనే టాక్ ప్రజల్లోకి వెళ్లడంతో మళ్ళీ జగనే అనే వాయిస్ ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: