ప్ర‌కాశం: ఒక్క మాట‌తో ద‌ర్శి జ‌నాల మ‌నస్సులు గెలిచేసిన ' గొట్టిపాటి లక్ష్మి '

RAMAKRISHNA S.S.
స‌మ‌స్య‌లు కామ‌నే. కానీ, వాటిని ప‌రిష్క‌రించాల‌న్న ల‌క్ష్యం ఉండాలి. ఆ దిశ‌గా ఒక ఆలోచ‌న చేయాలి. అదే విధంగా వాటిని ప‌రిష్క‌రించే వ్యూహం కూడా ఉండాలి. ఇలాంటి ఆలోచ‌న అంద‌రికీ సాధ్యం కాదు. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చేత అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌న్న త‌ప‌న ఉన్న‌వారికి మాత్ర‌మే ఇది సాధ్య‌మ‌వుతుంది. ఏదో వ‌చ్చాం.. ఏదో వెళ్లాం.. అన్న‌ట్టుగా ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి.. కార్య‌రంగంలోకి దిగే నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ల‌క్కు చిక్కితే ఓకే లేక‌పోతే.. వెంట‌నే అక్క‌డ నుంచి జంపే..!
ఇదీ.. కొన్నాళ్లుగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో కనిపిస్తోంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం నిజ‌మైన నాయ‌కులు క‌నిపిస్తున్నారు. ప్ర‌జ‌ల కోస‌మే అతి పెద్ద వృత్తిని సైతం ప‌క్క‌న పెట్టి మ‌రీ వ‌చ్చిన వారు ఉన్నారు. ఇలాంటివారిలో డాక్ట‌ర్ గొట్టిపాటి ల‌క్ష్మి ఒకరు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె బ‌రిలో నిలిచారు. టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు అయిన గొట్టిపాటి హ‌నుమంత‌రావుకు స్వ‌యానా మ‌న‌వ‌రాలు.. తండ్రి న‌ర‌స‌య్య కూడా రాజ‌కీయంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తే.
ఇక న‌ర‌సారావుపేట‌లో వైద్య వృత్తిలో ఉన్న ల‌క్ష్మి అలా ద‌ర్శిలో అడుగుపెట్టారో లేదో ద‌ర్శి దద్ద‌రిల్లిపోయింది. తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న ల‌క్ష్మిని ప‌ల‌క‌రిస్తే.. ఎంత దూర‌దృష్టి ఉందో అర్ధ‌మ‌వుతుంది. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది బాట‌లో న‌డిపించాల‌నే కృత నిశ్చ‌యం క‌నిపిస్తుంది.
ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా ప‌నిచేశారు. కానీ, స్థానిక స‌మ‌స్య‌లు మాత్రం అలానే ఉన్నాయి. అస‌లు ఆయా స‌మ‌స్య‌ల‌పై కొంద‌రికి అవ‌గాహ‌న కూడా లేదు. కానీ, డాక్ట‌ర్ ల‌క్ష్మి ఇక్క‌డ మ‌న సు పెట్టారు.
తాను అభ్య‌ర్థిగా నిల‌బ‌డ‌డానికి ముందే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏస‌మ‌స్య ఉంది.. దేనిని ముందుగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌న్న విష‌యంపై పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఈ ప్రాంతంపై ఆమెకు, ఆమె కుటుంబానికి ఎప్ప‌టి నుంచో మంచి ప‌ట్టు ఉంది. వెన‌క‌ప‌డిన ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో తొలి ప్రాధాన్యంగా సాగు, తాగు నీటి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న‌ది త‌న క‌ర్త‌వ్య‌మ‌ని ల‌క్ష్మి పేర్కొన్నారు.  వీటితో పాటు స్థానిక సంస్థ‌ల స‌మ‌స్య‌లు, విద్య, ఉద్యోగ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తాన‌ని చెబుతున్నారు.
గ‌త వైసీపీ పాల‌న‌తో ఆర్థికంగా చితికిపోయిన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, హాక‌ర్లు.. స‌హా అన్ని వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు త‌న‌వ‌ద్ద మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మి చెబుతున్నారు. ద‌ర్శిని అభివృద్ధి బాట‌లో ముందుకు తీసుకువెళ్లేందుకు త‌న‌వంతు కృషి ఎప్పుడూ చేస్తాన‌ని కూడా ఆమె తెలిపారు. ద‌ర్శిని అత్యున్న త‌స్థాయి నియోజ‌క‌వ‌ర్గంగా ముందు నిలిపే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని దీనికి త‌న వ‌ద్ద ప‌క్కా ప్ర‌ణాళిక ఉంద‌ని తెలిపారు. ఏదేమైనా రాజ‌కీయాల‌కు ఇదే కొత్త అయినా ఆమెకు ఉన్న ప్లానింగ్‌, స్ప‌ష్ట‌మైన వాగ్దాటికి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: