ప‌రుచూరులో వైసీపీకి భారీ షాక్ .. ఎమ్మెల్యే ' ఏలూరి ' మ్యాజిక్ ...!

RAMAKRISHNA S.S.
- టీడీపీలో చేరిన ప్రకాశం జిల్లా డైయిరీ మాజీ చైర్మన్ ఫ్యామిలీ
- ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన‌ చంగలయ్య సోదరుడు కుమారుడు శ్రీనివాసరావు
- మరో 4 నలుగురు కీలక వైసిపిని వీడి తెలుగుదేశంలో చేరిక

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎన్నిక‌ల వేడి అలా రాజుకుందో లేదో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార వైసీపీ నామినేష‌న్ల ప‌ర్వం కూడా ప్రారంభం కాకుండానే చేతులు ఎత్తేస్తోంది. ఈ క్ర‌మంలోనే బాప‌ట్ల జిల్లాలోని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ క్యాండెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుకు అనుకూలంగా వార్ వ‌న్ సైడ్ అయిపోతోంది. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గానికి గుండె కాయ లాంటి మార్టూరు మండ‌లం కోనంకి గ్రామంలో వైఎస్ఆర్సిపికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రకాశం జిల్లా పాల డైయిరీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి చెంగయ్య సోదరుడు మోహన్ రావు కుమారుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఆయనకు తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పర్చూరు నియోజకవర్గంలో ఉప్పలపాటి చంగలయ్య  వైఎస్ఆర్ సీపీకి ముఖ్య నేతగా ఉన్నారు. చంగలయ్య కుటుంబం నుంచి ఆయన సోదరుడు  మోహన్ రావు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడం భారీ షాక్ తగిలినట్టు అయింది. అలాగే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సొంత గ్రామమైన కోనంకి లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కుటుంబం తెలుగుదేశంలో చేరడం ఏలూరి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

అలాగే గ్రామానికి చెందిన అత్యంత కీలక నేతలు వైఎస్ఆర్సిపి ని వీడి ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్సిపి ని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడంతో ఆ గ్రామంలో వైకాపాకు తీవ్ర నష్టం వాటిలినట్లు భావిస్తున్నారు. పార్టీలో చేరిన వారిలో మందపాటి శ్రీధర్, కొర్రపాటి కిషోర్, కొర్రపాటి కృష్ణ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తోడు గ్రామంలో త్వరలో పెద్ద ఎత్తున వైకాపాన్ని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చర్చ జరుగుతుంది.

ఈ ఊపు చూస్తుంటే మార్టూరు మండ‌లంలో ఎన్నిక‌ల టైంకే ప‌రిస్థితి టీడీపీకి పూర్తి అనుకూలంగా మారిపోనుంది. హోరాహోరీగా పోరు ఉండే మార్టూరులోనే ఈ ప‌రిస్థితి ఉందంటే ఏలూరి మెజార్టీ అంచ‌నాల‌కు మించి పోతుంద‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: