బాప‌ట్ల : ' వైసీపీ నందిగం సురేష్ ' గ్యారెంటీగా ఓడే క్యాండెట్‌... రాసిపెట్టుకోండి..!

RAMAKRISHNA S.S.
గత ఎన్నికలలో వైసీపీ అనూహ్య‌ విజయం సాధించిన నియోజకవర్గాలలో బాపట్ల పార్లమెంటు సీటు ఒక‌టి. ఇక్కడ నుంచి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని నందిగం సురేష్ ఎంపీగా గెలిచారు. విచిత్రం ఏంటంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగుచోట్ల తెలుగుదేశం గెలిచినా కూడా.. ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసిన నందిగం గెలిచారు. బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించడంతో అక్కడ వచ్చిన మెజార్టీతోనే నందిగం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మరోసారి నందిగం సురేష్ వైసీపీ నుంచి పోటీలో ఉంటే.. టీడీపీ నుంచి తెలంగాణకు చెందిన బీజేపీ నేత చివరిలో టీడీపీలోకి జాయిన్ అయి పోటీలో ఉన్నారు  

తెలంగాణలో వరంగల్ బీజేపీ సీటు ఆశించిన టి.కృష్ణ ప్రసాద్ అనూహ్యంగా బాపట్లలో టీడీపీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితులలో బాపట్ల పార్లమెంటు సీటులో తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ పార్లమెంటు పరిధిలో పలువురు అభ్యర్థులను జంబ్లింగ్ చేసిన కూడా పరిస్థితి అదుపు తప్పేసింది. వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జునను సంతనూతలపాడుకు మార్చారు. ప్రకాశం జిల్లా కొండపి ఇన్చార్జి వరికుట్టి అశోక్ బాబును వేమూరుకు తెచ్చారు. వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యక్తిగతంగా సౌమ్యుడు. పైగా గత ఎన్నికలలో ఓడిన సానుభూతితో ఈసారి చాలా సింపుల్గా విజయం సాధించే పరిస్థితి ఉంది.

రేపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గౌడ్, ముందు రాజకీయ అనుభవం లేని ఈపూరి గణేష్‌ను ఢీ కొట్టి గెలిచే అంత సీన్ లేదు. అద్దంకిలో బాచిన కృష్ణ చైతన్యను పక్కనపెట్టి ఎక్కడో పలనాడు జిల్లాలోని పెద‌కూరపాడు నియోజకవర్గానికి చెందిన పాణెం హనిమిరెడ్డికి సీటు ఇచ్చారు. అలాగే పరుచూరులో ఏలూరు సాంబశివరావు పై కాపు వర్గానికి చెందిన ఎడం బాలాజీకి సీటు ఇచ్చారు. ఈ రెండు సెగ్మెంట్లలో కమ్మేతర నాయకులు అయిన రెడ్డి, కాపులకు సీట్లు ఇవ్వడంతో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో చీరాలలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన తనయుడు కరణం వెంకటేష్ కు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఇండిపెండెంట్గా లేదా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. చేనేతలు లేదా ఇతర బీసీ కులాలకు ఇక్కడ వైసీపీ సీటు ఇస్తుందని ఆశలు పెట్టుకుంటే.. జగన్ మొండి చేయి చూపించారు. దీంతో ఇక్కడ బీసీలు మొత్తం రివర్స్ అయ్యి టీడీపీకి మద్దతుగా నిలుస్తారని తెలుస్తోంది. పైగా టీడీపీ బీసీల్లో బలమైన యాదవ కమ్యూనిటీకి చెందిన కొండయ్య యాదవ్ కు టికెట్ ఇచ్చింది.

దీనికి తోడు ఆ మంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వైసీపీకి పడే ఓట్లు చీలి కరణం వెంకటేష్ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవ‌రాల్‌గా పార్లమెంటు పరిధిలో వైసిపి గట్టి పోటీ ఇచ్చే సీట్లలో ఒక బాపట్ల మాత్రమే కనిపిస్తోంది అక్కడ కూడా రెండుసార్లు గెలిచిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కి టిడిపి నేత నరేంద్ర వర్మ గట్టి పోటీ ఇస్తున్నారు ఫలితం ఎవరికి అయినా అనుకూలంగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి  పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలలో ఆరు చోట్ల టిడిపి సునాయాసనంగా విజయం సాధించే అవకాశాలు ఉండడంతో ఇక్కడ పార్లమెంటు సీటుపై ఈసారి టిడిపి జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది.

పార్లమెంటు పరిధిలో వైసీపీ గట్టి పోటీ ఇచ్చే సీట్లలో ఒక బాపట్ల మాత్రమే కనిపిస్తోంది. అక్కడ కూడా రెండుసార్లు గెలిచిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి టీడీపీ నేత నరేంద్ర వర్మ గట్టి పోటీ ఇస్తున్నారు. ఫలితం ఎవరికి అయిన వచ్చే ఛాన్సులు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలలో ఆరు చోట్ల టీడీపీ సునాయాసన విజయం సాధించే అవకాశాలు ఉండడంతో ఇక్కడ పార్లమెంటు సీటుపై ఈసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: