గ‌న్న‌వ‌రం గ‌రంగ‌రం... వంశీకి అంత సీన్ లేద‌ని అర్థ‌మైపోయిందా...!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణా జిల్లాలో విజయవాడకు ఆనుకుని జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరుసగా రెండుసార్లు గెలిచారు. 2014, 2019.. రెండు ఎన్నికలలో వంశీ టీడీపీ నుంచి గెలిచారు. 1955లో ఏర్పడిన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య.. కాకాని వెంకటరత్నంలాంటి దిగ్గజాలు ప్రాథినిత్యం వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య మూడుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉండేది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలకు చెక్ పెడుతూ ఈ నియోజకవర్గంలో టీడీపీ హవా కొనసాగింది. గన్నవరం అంటే పసుపు పార్టీకి కంచుకోట అనే ముద్ర పడిపోయింది. 1989లో ఇక్కడ చివరిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఇండిపెండెంట్ లు గెలిచారు. 2009 నుంచి గన్నవరంలో వరుసగా మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాల సాధిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన వంశీ ఆ తర్వాత జగన్ చెంత చేరిపోయారు.
వైసీపీకి దగ్గరైనా కూడా చంద్రబాబు, లోకేష్ తెలుగుదేశం పార్టీతో పాటు చివరకు చంద్రబాబు భార్య భువనేశ్వరి పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలతో వంశీ పై నియోజకవర్గంలో కులాలు, వర్గాలకు సంబంధం లేకుండా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. మరి ముఖ్యంగా కమ్మ‌ సామాజిక వర్గం వంశీ పై కక్ష కట్టి ఈసారి ఎలాగైనా ఓడించాలని కసితో ఉంది. దీనికి తోడు అటు వైసీపీలో ప‌లు వర్గాలు వంశీకి వ్యతిరేకంగా ఉన్నాయి. గత ఎన్నికలలో వంశీ పై కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్ల‌గ‌డ్డ‌ వెంకట్రావు ఇప్పుడు టీడీపీ నుంచి వంశీ పై పోటీ చేస్తున్నారు.
విచిత్రం ఏంటంటే వంశీకి వైసీపీలో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వర్గం సహకరించడం లేదు. అటు కాపు సామాజిక వర్గంతో పాటు బీసీలు.. ఇటు కమ్మ వర్గం ఓటర్లు.. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. పైగా చంద్రబాబు అండతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన కుటుంబాన్ని దూషించటం మైనస్ గా మారింది. ఆ తర్వాత బహిరంగంగా వంశీ భువనేశ్వరీకి క్షమాపణలు చెప్పిన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు మండలాలతో పాటు.. విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలు ఉన్నాయి.
అన్నిచోట్ల యార్ల‌గడ్డ వెంకట్రావు తన అనుచర గ‌ణాన్ని పెంచుకున్నారు. విచిత్రమైన టీడీపీలో నేతలు అందరిని కలుపుకుని యార్లగడ్డ వెంకట్రావు సమన్వయంతో ముందుకు వెళుతుంటే.. ఇటు వంశీకి టీడీపీ వాళ్లతో పాటు సొంత పార్టీ నేతలతోనే పడటం లేదు. ఏది ఏమైనా ఈసారి గన్నవరం నియోజకవర్గంలో వంశీ గెలవటం అంత సులువు కాదు. మెజార్టీ సర్వేలు అంచనాలు మాత్రం యార్లగడ్డ వైపు ఫలితం మొగ్గుచూపుతోందని ఓపెన్ గానే చెప్పేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: