పెద్ద స్కెచ్చే వేసిన కేసీఆర్.. ఈ సారైనా అక్కడ భోణికొడతారా?

praveen
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని పార్టీగా అవతరించింది టిఆర్ఎస్. ఏకంగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. దీంతో ఇక దేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించేందుకు టిఆర్ఎస్ గా ఉన్న పేరును కాస్త బీఆర్ఎస్ గా మార్చుకుంది. కానీ హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న బిఆర్ఎస్ కి గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. కెసిఆర్ సీఎంగా ఉన్నప్పుడు నామరూపాల్లేకుండా చేయాలనుకున్న అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఇక కెసిఆర్ ని దెబ్బ కొట్టి అధికారాన్ని చేపట్టింది. ఇక ఇప్పుడు కేసీఆర్ పార్టీలోని నేతలందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటుంది.

 అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయ్. బిఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వంతు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని అనుకుంటుంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపడం పై స్పెషల్ ఫోకస్ పెట్టి అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్. అయితే మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించడం పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. 38 లక్షలకు పైగా ఓటర్లు ఉండే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం ప్రతి పార్టీకి సెంటిమెంట్ గా ఉంటుంది.

 ఈ క్రమంలోనే ఈ పార్లమెంట్ స్థానంలో విజయం కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తుండగా.. అటు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టి తన మాస్టర్ మైండ్ వ్యూహాలకు పని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంటు స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా.. ఒకసారి కూడా బిఆర్ఎస్ ఇక్కడ బోనీ కొట్టలేదు. ఈసారి మల్కాజ్గిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాడు కెసిఆర్. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి స్థానిక నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు స్థానికేతరులు అంటూ చెబుతూ.. ఇక లోకల్ అనే నినాదంతో ప్రచారం చేస్తున్నారు లక్ష్మారెడ్డి. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఇది కెసిఆర్ కు కలిసి వచ్చే అంశమే. ఏం జరుగుతుందో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: