అధికారంలో ఉన్నప్పుడే సాధించలేదు.. కేసీఆర్ వల్ల ఇప్పుడవుతుందా?

praveen
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న బిఆర్ఎస్ చివరికి ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మెజారిటీ స్థానాలలో విజయం సాధించాలని గులాబీ దళపతి కేసీఆర్ అనుకున్నారు. కానీ అంతకుముందే ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీంతో గత కొంతకాలం నుంచి బిఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయ్.

 ఇలాంటి పరిస్థితుల మధ్య అటు బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతుందా లేదా అనే అనుమానాలు కూడా తెరమీదకి వస్తున్నాయి. అయితే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం. ఇక్కడ 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దేశంలోనే వివిధ ప్రాంతాలు వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ ఓటు హక్కును కలిగి ఉన్నారు. అయితే ఇక ఈ పార్లమెంట్ స్థానం బరిలో లక్ష్మారెడ్డిని బరిలోకి దింపారు కేసీఆర్. లోకల్ నాన్ లోకల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.

 మరోవైపు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ క్లీన్ స్వీట్ చేసింది. ఇది కలిసి వచ్చే అంశమే. కానీ గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మల్కాజిగిరి ఎంపీ సీట్ గెలుచుకోలేకపోయింది బిఆర్ఎస్. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించినా.. కెసిఆర్ తన మాస్టర్ మైండ్ కి పని పెట్టినా అటు మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఇప్పటివరకు బోణి కొట్టలేదు బిఆర్ఎస్.

 మరి ఇప్పుడు పార్టీలో గందరగోళ పరిస్థితులు ఉండగా.. పార్టీ ఫిరాయింపులు జరుగుతుండగా.. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండగా.. గెలుపు సాధ్యమవుతుందా అన్నది హాట్ టాపిక్ మారింది. మరోవైపు కాంగ్రెస్కు మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక బిఆర్ఎస్ మల్కాజిగిరిలో విజయం సాధించడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు మాట. మరి ఏం జరుగుతుంది అన్నది ఓటర్ల చేతిలోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: