రాయలసీమ (హిందూపురం) : సీఎం జగన్ కు ఎమ్మెల్సీ ఝలక్..!

Divya
అనంతపురం జిల్లాలో తాజాగా వైసిపి పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది.. ఎమ్మెల్సీ పదవికి వైసిపి షేక్ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.. తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీలో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఒక లేఖ రాసినట్టుగా సమాచారం.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు అలాగే మండలి చైర్మన్ కు సైతం ఇక్బాల్ ఈమెయిల్ ద్వారా పంపించినట్లు తెలుస్తోంది..

2027 మార్చి వరకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ తన వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ఆయన తెలియజేశారు.. అలాగే తన రాజీనామాను  వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ కి కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందట.. వారం రోజులలో ఆయన టిడిపి పార్టీలోకి చేరబోతున్నట్లు సమాచారం.. ఐపీఎస్ అధికారి అయిన ఇక్బాల్ రాయలసీమలో ఐసీగా కూడా పనిచేశారు.. అలా రాజకీయాలలో ఆసక్తి ఉండడంతో వైసీపీ పార్టీలో చేరారు. దీంతో 2019లో అప్పటి నియోజకవర్గ ఇన్చార్జిగా నవీన్ నిత్యాలను పక్కనపెట్టి మరీ జగన్ ఈయనకు హిందూపురం అసెంబ్లీ స్థానానికి టికెట్ ఇచ్చారు.

అయితే అక్కడ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి బాలకృష్ణ చేతిలో ఇగ్బాల్ ఓడిపోయారు..  ఆ తర్వాత కూడా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరి గౌరవించారు..హిందూపురం లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా నియమించడం జరిగింది.అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం దీపిక అనే ఒక మహిళకు హిందూపురం నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వడంతో ఎన్నికలలో కూడా టికెట్ ఆమెకే ఇచ్చేశారు. దీంతో ఇక్బాల్ అసహనాన్ని వ్యక్తం చేసి పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.. హిందూపురం నియోజకవర్గం లో వైసీపీలో మూడు, నాలుగు వర్గాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో ఇటీవల కాలంలో ఇక్బాల్ కు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి పిలుపు కూడా రాకపోవడంతో తనని పూర్తిగా పక్కకి పెట్టేసారని అవమానంగా ఫీల్ అయినట్టుగా సమాచారం. అందుకే రాజీనామా చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: