చంద్రబాబు కష్టాన్ని వాళ్ల ఓవరాక్షన్‌ దెబ్బ తీస్తుందా?

Chakravarthi Kalyan
ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు తన శక్తికి  మించి ప్రయత్నిస్తున్నారు. మండుడెండను సైతం లెక్క చేయకుండా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.  ఒక విధంగా చెప్పాలంటే తన శక్తినంతా పార్టీ కోసమే ధారపోస్తున్నారు. ఈ సమయంలో పార్టీ నాయకులు ఆయనలా కష్టపడకపోయినా ఫర్వాలేదు. కానీ అనవసర ఆరోపణలు చేస్తూ.. చంద్రబాబు శ్రమను బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తున్నారు.

ఈ సమయంలో తెలుగు తమ్ముళ్లు కొంచెం సంయమనం పాటిస్తే మేలని పలువురు సూచిస్తున్నారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు అవకాశాలను మెరుగు పరుస్తూ ఒక్కొక్క ఇటుక పేర్చినట్లు పాజిటివ్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి కేంద్రం సపోర్టు కావాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి బలం లేకపోయినా అడిగిన సీట్లు ఇచ్చారు. పొత్తు కోసం ఎంతగా ఎదురు చూశారో.. అపాయిట్ మెంట్ కోసం దిల్లీలో ఎన్ని రోజులు పడిగాపులు కాశారో చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులకు కూడా తెలుసు.

పొత్తు ధర్మం పాటించాల్సిన చోట రఘురామ కృష్ణం రాజుమీద అభిమానంతో శ్రీనివాస వర్మ మీద, బీజేపీ మీద టీడీపీ తన సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తోంది. వీటితో పాటు పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వంటివి చేస్తున్నారు. ఇవి బీజేపీ కార్యకర్తల్లో టీడీపీపై ద్వేషాన్ని పెంచుతాయి. దీంతో కాషాయ పార్టీ నేతలు సపోర్ట్ చేయడం ఆపేసి.. ఓట్ల బదలాయింపు కూడా జరిగే పరిస్థితి ఉండదు. ఇది టీడీపీకి అంతిమంగా నష్టం చేకూరుస్తుంది.

వాలంటీర్ల విషయం ప్రస్తుతం ఏపీలో రచ్చ లేపుతున్న విషయం తెలిసిందే.  దీనిని చంద్రబాబు చాలా తెలివిగా తన చేతికి మట్టి అంటకుండా ఈ వ్యవస్థను ఆపగలిగారు.  దీనిపై ప్రజలు టీడీపీపై కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ నేతలు దీనిని మేమే ఆపించగలిగాం అని గొప్పగా చెబుతూ లేనిపోని.. ఆ పార్టీకే చేటు తెస్తున్నారు. ఇది అంతిమంగా పార్టీకి నష్టం చేకూరుస్తుందా.. లేక లాభమా అనేది ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: