బిఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో 12 మంది ఎమ్మెల్యేలు?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఎంత వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీల ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకవైపు విజయం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో బిజీ బిజీగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎలా అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇక బిఆర్ఎస్ లో చేర్చుకున్నారో ఇక ఇప్పుడు సీఎం రేవంత్ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

 ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఏకంగా కేసీఆర్ నమ్మిన నమ్మిన బంటు అని పేరు తెచ్చుకున్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి  చేరుకోవడంతో ఇక అటు గులాబీ దళపతి కెసిఆర్ కు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి అని చెప్పాలి. అయితే తాము గేట్లు ఎత్తివేస్తే టిఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పుడు చెప్పింది నిజమే అవుతుందేమో అనే భావన ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అందరికీ అర్థమవుతుంది. ఇకపోతే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇప్పటికే పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకోగా.. ఇక ఈరోజు తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ సభలో మరో 12 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గంగుల కమలాకర్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కోవా లక్ష్మి, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగుంట గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని బిఆర్ఎస్ కొట్టి పారిస్తుండగా.. ఏం జరుగుతుంది అన్నది కాంగ్రెస్ సభ ముగిసే వరకు ఉత్కంఠ నెలకొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs

సంబంధిత వార్తలు: