ఏపీ:లోకేష్ మైలేజ్ పెరిగిందా..?

Divya
గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలలో కూడా ఎటూ తేల్చని పరిస్థితి ఏర్పడింది.. టీడీపీ పార్టీ రాజధానిగా అమరావతి ఉండాలని.. వైసీపీ మాత్రం మూడు రాజధానులు అంటూ .. పదవీకాలం పూర్తయినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి రాజధానిని ప్రకటించలేదు.. అయితే మరోవైపు ఇప్పుడు మరో కొద్ది రోజులలో ఎలక్షన్స్ జరగబోతున్న సమయంలో దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు పలువురు రాజకీయనేతలు.. తాజాగా ఇండియా హెరాల్డ్ కి అందిన సమాచారం మేరకు రాజధాని విషయంలో జగన్ కి లోకేష్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది..

అమరావతి రాజధాని కావాలంటూ మహిళలతో రోజూ దీక్షలు.. ఉదయం లేచింది మొదలు.. అక్కడే అమరావతి మహిళలతో కూర్చొని , అల్పాహారం చేసి,  ఫోటోలు దిగి ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు.. ఈ తతంగం అంతా చాలా రోజులుగా జరుగుతోంది. చాలా పగడ్బందీగా ఈ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది టీడీపీ..  అయితే ఇందుకు కౌంటర్ గా వైసీపీ పార్టీ  బహుజన కార్యక్రమం అంటూ మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడే కొంతమందితో టీడీపీకి వ్యతిరేకంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. . అయితే ఇక్కడ ఉన్న వారికి భోజనాలు,  వారి యొక్క వసతులను మొత్తం పార్టీనే చూసుకొనేది.

అయితే బహుజన కార్యక్రమం మొదట్లో 100 మంది ఉండేవారు.. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుకుంటూ చివరికి వారిని పార్టీ పట్టించుకోలేదని తెలిసి మూడు రాజధానుల అనే శిబిరం వాళ్లు వెళ్లి ఏకంగా తెలుగుదేశం పార్టీ లో చేరి పరిపాలన రాజకీయంతో లాభం జరుగుతుందని మోసపోయామంటూ.. బహుజన కార్యక్రమం నేత మాజీ నేత గురునాథం తెలియజేశారు. గుంటూరు నగరం జిల్లాలో దాదాపుగా నాలుగేళ్ల  పాటు కొనసాగిన మూడు రాజధానుల  శిబిరాన్ని ఎత్తేస్తున్నట్లు వైఎస్ఆర్సిపి పరిరక్షణ నేతలు ప్రకటించారు. అలాగే తెలుగుదేశం లో విలీనం చేస్తున్నట్లుగా కూడా గురునాథం ప్రకటించారు. దీంతో అక్కడి నేతలు నిన్నటి రోజున మంగళగిరిలో వారందరికి కండువా కప్పి సాదరంగా టీడీపీ లోకి ఆహ్వానించారు.. ఇక్కడ జరిగే పరిణామాలను బట్టి చూస్తే లోకేష్ మైలేజ్ బాగా పెరిగిందని అర్థమవుతుంది. మరి ఇక్కడి వారిని జగన్ ఎలా తనవైపు తిప్పుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: