ఏపీ: కూటమికి బలైన ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కూటమి ఈదురుగాలులకు కొందరు బలవుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో కూటమి టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వర్‌రెడ్డికి ఎదురుగాలి విస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, అక్కడ టీడీపీ అభ్యర్థి ప్రచారానికి జనసేన, బీజేపీ నేతల నుండి ఎలాంటి సహాయ సహకారాలు లభించడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు వైసీపీ తరపున కర్నూల్ మాజీ ఎంపీ, బుట్టా రేణుక పోటీ చేస్తుండగా ఆమె విజయం దాదాపు ఖాయమనే అంటున్నారు విశ్లేషకులు. ఇటువంటి తరుణంలో కూడా టీడీపీ అభ్యర్థికి పొత్తు పార్టీల నుండే సహకారం లభించడం లేదంటే అర్ధం చేసుకోవాలి. అక్కడ ఎంత కష్టపడినా అవకాశం ఉండదని భావించిన పచ్చ అధిష్టానం సమయం వృధా చేసుకోవడం ఎందుకని అలా చేయొచ్చని అంతా అనుకుంటున్నారు.
అయితే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. బీజేపీ ఇంఛార్జీ మురారిరెడ్డి, జనసేన ఇంఛార్జీ రేఖ గౌడ్ అక్కడ టికెట్ ఆశీంచి భంగపడ్డ విషయం విదితమే. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నా పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కించుకుంది. అయితే తమను ప్రచారంలో కలపుపుకుపోవడం లేదని, అందుకే టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు బీజేపీ,జనసేన నేతలు. బీజేపీ, జనసేన నేతలు సహకరించక పోవడం ఒక ఎత్తైతే సొంత పార్టీ నుండి కూడా జయ నాగేశ్వర్‌ రెడ్డిపై వ్యతిరేకత రావడం చాలా బాధాకరం అని కొంతమంది కార్యకర్తలు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే తమ పట్ల జయ నాగేశ్వర్ రెడ్డి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదంతా ఒకెత్తయితే కొంతమంది టీడీపీ అభ్యర్ధులపైన ఏకంగా చంద్ర బాబుకు ఫిర్యాదు అందిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అక్కడ తీరు వైసీపీ విజయానికి మరింత దోహదం చేసేలా ఉందని స్థానికంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన వైసీపీ అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: