ఏపీ: అసంతృప్తితో బాధపడుతున్న నేతలను బుజ్జగిస్తున్న బాబు?

Suma Kallamadi
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కూటమిలో ఏర్పడ్డ కుదుపులకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఓ వైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో బిజీ అయిపొయింది. అవును, కర్నూలు జిల్లాలో సీటు దక్కని అసంతృప్త నేతలను బాబు బుజ్జగించే పనిలో పడ్డాడని వినికిడి. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రెబెల్స్ గా పోటీకి సిద్ధమవుతోన్న పలువురు నేతలను కలవడానికి బాబు బాగా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఆదోని, కోడుమూరు, మంత్రాలయం ఏరియాలో టీడీపీ తీవ్రమైన సమస్యలే ఎదుర్కోవాల్సి రావడం ఒకింత బాధాకరం. అందువలన బాబుగారికి కోడుమూరులో ఆకెపోగు ప్రభాకర్, ఆదోనికి చెందిన మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన తిక్కారెడ్డితో చర్చలు జరపక తప్పడంలేదు.
పార్టీ జోనల్‌ ఇంఛార్జ్‌ బీద రవిచంద్ర నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం ఈపాటికే కోడుమూరులో ప్రభాకర్, మంత్రాలయంలో తిక్కారెడ్డితో చర్చలు నెరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరిగిందంటూ తిక్కారెడ్డి, ప్రభాకర్ అందరి ముందు శివమెత్తినట్టు తెలుస్తోంది. ఇవాళ కూడా కోడుమూరు టీడీపీ నేత ప్రభాకర్ ను బుజ్జగించేందుకు బీద రవిచంద్ర యాదవ్ టీమ్‌ వెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరాగాల్సి వచ్చింది. అయితే, ఆయన కావాలనే ఆ బృందాన్ని కలవలేదని ఇన్సైడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ మరోవైపు కోడుమూరు టికెట్‌ను అమ్ముకున్నారని బీదరవి చంద్రపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు.. ఆలూరు టికెట్ తనకివ్వలేదని, తనను కలసే ప్రయత్నం మనుకొమ్మని బీద రవిచంద్ర యాదవ్‌కు, కోట్ల సుజాతమ్మ సూటిగానే సమాధానం చెప్పిందని ప్రచారం సాగుతోంది. ఇన్ని అవకతవకల మధ్య పచ్చ పార్టీ ఎటువంటి దారుణాలను చవిచూడాల్సి వస్తుందో అని కార్యకర్తలు తెగ మధనపడిపోతున్నారు. మరి ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయా? నేతలు రెబల్స్‌గానే బరిలోకి దిగుతారా? అనేది ఇపుడు ఉత్కంఠగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: