తెలంగాణ: ఓటుకు నోటు కేసులో బాబుని ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై విచారణ నేడే!
ఈ కేసులోనే చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని, అలాగే కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణాలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం వలన విచారణను సీబీఐకి అప్పగించాలన్న విజ్ఞప్తిలో అయితే ఫుల్ క్లారిటీ వుంది. ఈ పిటిషన్లపై జస్టిస్ సురేందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున టీడీపీతో పాటు అన్ని రాజకీయ పక్షాలు సుప్రీంకోర్టు విచారణ వైపు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అనడంలో సందేహమే లేదు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం ఇవాలే విచారణ చేపట్టనుంది. ఇక, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు మాజీ సీఎం చంద్ర బాబు డబ్బులను ఎరగా చూపించడం ఈ ప్రపంచం అంతా చూసింది. ఈ సందర్బంగా 'మనోళ్లు బ్రీఫ్డ్ మీ' అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ కూడా అప్పట్లో నిర్ధారించింది. అయితే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.