ఏపీ : జగన్ కు బిగ్ షాక్.. చంద్రబాబు కోసం రంగంలోకి హీరోయిన్?

praveen
ఏపీలో రాజకీయం ఎంతలా వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందేమో అన్న విధంగా పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఏ చిన్న విషయం తెర మీదికి వచ్చిన అదే పట్టుకుని లాగుతూ.. అధికార పార్టీ ప్రతిపక్షాలను.. ఇక ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఏకిపారేస్తుంది. ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసిన తమకు అనుకూలంగా మార్చుకుని.. అదే విషయాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్లి.. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రతిపక్షాలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.

 ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతూ ఉండగా.. టిడిపి జనసేన బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఇక మరోవైపు వైసీపీ అధినేత జగన్ సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి జగన్ ను ఓడించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. దీంతో ప్రస్తుతం ఎండాకాలం వేడి కంటే ఆంధ్ర రాజకీయం వేడే ఎక్కువగా ఉంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించి సీఎం కుర్చిని దక్కించుకోవాలనుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబు.. తనకున్న అనుభవాన్ని మొత్తం ఉపయోగించి మాస్టర్ మైండ్ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.

 ఇలాంటి సమయంలో ఏకంగా ప్రచార రంగంలోకి ఒక హీరోయిన్ ను బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు అన్నది తెలుస్తోంది. రాష్ట్రంలో టిడిపి తరఫున పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ బిజెపి నేత, సీనియర్ హీరోయిన్ జయప్రద ఇటీవలే ప్రకటించారు. నేను ప్రస్తుతం యూపీలో ఉంటున్న.. అయినప్పటికీ ఎప్పటికీ నేను తెలుగు బిడ్డనే. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు ఇష్టం. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కానీ.. ప్రత్యేక రాజధాని కానీ లేవు. వాటికోసం పోరాడుతా. ఎవరైతే యువతకి ఉపాధి కల్పించడంతోపాటు శాశ్వత రాజధాని నిర్మిస్తారో ఇక వారికోసం తప్పక ప్రచారం చేస్తాను అంటూ జయప్రద ఇటీవల ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఎప్పుడు సెలబ్రిటీలు ప్రచారం చేసిన పార్టీకి ప్లస్ అవుతూ ఉంటుంది  దీంతో జయప్రద ప్రచారం చంద్రబాబుకు ప్లస్ అవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: