వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలట.. కేటిఆర్ కౌంటర్?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే తగ్గుతుండగా అంతలోనే ఇక పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఈ వేడి ఒకసారిగా పెరిగిపోయింది. ఇక ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసిఆర్ చేసినట్లుగానే ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అటు బిఆర్ఎస్ నేతలు అందరిని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటున్నారు.

 అయితే బిఆర్ఎస్ లో ఉండే సాదాసీదా ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఏకంగా కీలక పదవులు చేపట్టిన కేసీఆర్ ఆప్తులు సైతం పార్టీని వేడి హస్తం పార్టీ కండువా కప్పుకుంటూ ఉండటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. దీంతో ఎప్పుడు ఎవరు ఇలా కారు దిగిపోతారు అనే విషయంపై అటు గులాబీ పార్టీ పెద్దల్లో ఆందోళన నెలకొంది అని చెప్పాలి. అయితే ఇలా పార్టీని వీడుతున్న వారిపై కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే ఇటీవల వికారాబాద్లో జరిగిన బి ఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు  కేటీఆర్ పార్టీని వీడిన ఇద్దరిపై సంచలన విమర్శలు చేశాడు.

 ఇటీవలే చేవెళ్లలో జరిగిన కార్యకర్తల కార్యక్రమానికి వెళుతుండగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి అని అడిగాను. అసెంబ్లీ ఎన్నికల్లో మీ సతీమణి చేసిన తప్పుని ఇప్పుడు నువ్వు చేయవద్దు అంటూ సూచించాను. తాను ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అంటూ మహేందర్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇలా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు చేసిన యాక్టింగ్ కి త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన ఆస్కార్ ఇచ్చిన కూడా తక్కువే అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. అయితే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు అనే విషయం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: